ఎంజీఎం డైక్ సెంటర్ లో నకిలీ ఉద్యోగి..?

వరంగల్ డైక్ సెంటర్ లో అవినీతి రాజ్యం ఏలుతున్నట్లు కనపడుతుంది… పెద్దాసుపత్రి ఎంజీఎం డైక్ సెంటర్ లో ఓ ఉద్యోగి ఏకంగా నకిలీ సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగం పొంది దర్జాగా ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది…ఈ విషయం గత కొద్ది నెలల నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరికి తెలిసిన కనీస చర్యలు తీసుకోకుండా వేడుక చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి….ఈ ఆరోపణలు అనోట ఈ నోటా డి ఎం ఈ కార్యాలయం వరకు చేరగా విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేసి కేవలం విచారణలకే పరిమితం ఐయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. ఎంజీఎం డైక్ సెంటర్ లో దొంగ సర్టిఫికెట్ల తో నకిలీ ఉద్యోగి కొనసాగుతున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు గమ్మున ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది….వరంగల్ డైక్ సెంటర్ లో 2018 నుంచి దాట ఎంట్రీ ఆపరేటర్ గా చేరి ఆ తర్వాత డైక్ మేనేజర్ గా దొంగ డిగ్రీ సర్టిఫికెట్ తో ఉద్యోగం లో చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి…ఈ విషయం బయట పడడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద విచారణకు ఆదేశించడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిక్కిం యూనివర్సిటీ కి విచారణకు సహకరించాలని ఓ లేఖ మేయిల్ చేశారు…ఇందుకు సమాధానంగ యూనివర్సిటీ అధికారులు పోలీస్ కమిషనర్ ద్వారా తమకు లేఖ పంపాలని కోరారు…కానీ ఇప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోలీసుల ద్వారా ఇప్పటికి లేఖను పంపించలేదు…దింతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… ఓ అధికారి అక్రమంగా ఉద్యోగం చేస్తున్న డైక్ మేనేజర్ కు సహకరిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి… అందుకే సిక్కిం యూనివర్సిటీ కి లేఖ పంపే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని కొందరు ప్రజా సంఘాల నేతలు అంటున్నారు…నకిలీ ఉద్యోగిగా కొనసాగుతున్న ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here