అడ్రస్ కనుక్కోండి..!

హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ న్యూస్10 పై అక్కసు వెళ్లగక్కడం పనిగా పెట్టుకున్నట్లు కనపడుతుంది…జిల్లా పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై న్యూస్10 వరుస కథనాలు వెలువరించడం ఆయనకు రుచించనట్లు కనపడుతుంది, అక్రమ ఆదాయానికి గండి పడడంతో న్యూస్10 పై అదనపు కలెక్టర్ కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం…. ఈ ఉన్నతాధికారి మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడితో కలిసి న్యూస్ 10 ప్రతినిధులను బెదిరించాలని చూస్తున్నట్లు విశ్వసనియంగా తెలిసింది… తనపై వస్తున్న కథనాల విషయంలో కలవర పడుతున్న అదనపు కలెక్టర్ ఎలాగైనా న్యూస్10 ప్రతినిధిని బెదిరించి కథనాలు ఆపించాలని విపళయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది న్యూస్ 10 రాస్తున్న వార్తల విషయంలో సమాధానం చెప్పుకోలేక అదనపు కలెక్టర్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు తెరవెనుక అనేక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది తనకి అన్నీ తెలుసు అన్నట్లుగా తాను తలుచుకుంటే ఏదైనా చేయగలనట్టు డంబాలు కొడుతున్న మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు మరికొందరితో కలిసి న్యూస్ 10 ప్రతినిధులను బెదిరించాలని చూస్తున్నట్లు తెలియ వచ్చింది… న్యూస్ 10 ప్రతినిధిని ఎలాగైనా బెదిరించాలని అదనపు కలెక్టర్ అసోసియేషన్ నాయకుడు కలిసి స్కెచ్ వేస్తున్నట్లు తెలిసింది …ఈ క్రమంలో అదనపు కలెక్టర్ ఇప్పటికే తనకు సంబంధించిన కొంతమంది అనుచరులతో సంప్రదింపులు జరిపి న్యూస్10 ప్రతినిధి ఇంటి అడ్రస్ ఎక్కడ …? అంటూ ఆరా తీసినట్లు తెలుస్తోంది… అడ్రస్ కనుక్కొని ఈ అదనపు కలెక్టర్ ఏం చేస్తాడో తెలియదు.. కానీ వార్తల విషయంలో అనేకసార్లు న్యూస్10 ప్రతినిధి వివరణ కోసం వెళితే కనీసం మాట్లాడకుండా, మాట్లాడితే నిర్లక్ష్యంగా మాట్లాడిన ఆయన అప్పుడే న్యూస్10 ప్రతినిధిని ఇంటి అడ్రస్ అడిగితే ఇంటి నెంబర్ తో సహా చెప్పేవాడు కదా… కానీ అలా చేయకుండా ఇతరుల ద్వారా అదనపు కలెక్టర్ న్యూస్10 ప్రతినిధి ఇంటి అడ్రస్ గురించి ఆరా తీయడం ఎందుకో ..? ఆయనకే తెలియాలి …తనపై అవినీతి ఆరోపణలు వస్తే ఆరోపణలు కథనాల రూపంలో పత్రికల్లో వెలువరిస్తే కోపం చేసే అదనపు కలెక్టర్ బెదిరిస్తే బెదిరిపోతారు అని అనుకుంటున్నట్లు ఉంది…ప్రజల తరుపున వకాల్తా పుచ్చుకొని జనహితమే మా మతంగా అక్షర సమరం చేస్తున్న న్యూస్10 ఎంతటి పెద్దవారి బెదిరింపులకు అయిన భయపడదు…కోట్ల రూపాయలు బకాయి ఉండి మిల్లర్ అసోసియేషన్ నాయకుడిగా చెలామణి అవుతూ తోటి మిల్లర్లను వసూళ్లతో పీల్చి పిప్పి చేస్తున్న అతగాడి ఉడత ఊపులకు భయపడే వారు న్యూస్10 లో ఎవరు లేరని గమనించాలి…

అదనపు కలెక్టర్ దే బాధ్యత…

హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖను మొత్తం అవినీతిమయంగా మార్చి మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడితో అంటకాగుతున్నా డని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు కలెక్టర్ ఆరోపణలు ఎన్ని వచ్చిన తనలో కనీస మార్పు కూడా తెచ్చుకోకుండా న్యూస్10 ప్రతినిధిని బెదిరించాలని ప్రయత్నాలు చేస్తుండడం శోచనీయం… మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడితో కలిసి బెదిరింపు యత్నాలు చేయడం ఎందుకో ఆయనకే తెలియాలి …జిల్లా పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తే ,కథనాలు రాస్తే న్యూస్10 అదనపు కలెక్టర్ కు శత్రువుగా మారింది…అంతే తప్ప అదనపు కలెక్టర్ కు న్యూస్10 కు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవనే విషయాన్ని ఆయన గ్రహించాలి..అలాగే న్యూస్10 ప్రతినిధులకు ఏం జరిగిన అదనపు కలెక్టర్,మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడే పూర్తి బాధ్యత వహించాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here