శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది…
ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో
విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు..
మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన, ఆస్పత్రికి తరలించారు…
హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్‌లోని గోఖలే నగర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది…
ఊరిగింపు రథం వెళ్తున్న దారిలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తాకడంతో షాక్ తగిలి కృష్ణయాదవ్(24), శ్రీకాంత్‌రెడ్డి(35)..
సురేష్(34), రుద్రవికాస్(39), రాజేంద్రరెడ్డి(39) లు అక్కడికక్కడే మృతిచెందారు…వీరిని కాపాడడానికి అక్కడున్న వారు ఎంతగా ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది… ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి….



