ఆ మిల్లుల్లో పిడిఎస్ బియ్యం…?

వరంగల్ జిల్లా లోని కొన్ని మిల్లుల్లో పి డి ఎస్ బియ్యం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది… ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన ఓ మిల్లు స్టిక్కర్స్ తో హన్మకొండ జిల్లా హసన్ పర్తి కి చెందిన ఓ మిల్లు వద్ద పిడిఎస్ బియ్యం లారీ లోడ్ పట్టుబడడం సంచలనంగా మారింది…ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా లోని కొందరు మిల్లర్లు సిఎంఆర్ పెట్టడానికి పి డి ఎస్ బియ్యం మార్గం అన్వేషిస్తున్నట్లు అర్థమైపోతుంది…సర్కార్ కేటాయించిన బియ్యాన్ని మర ఆడించి అక్రమ మార్గాన అమ్మి సొమ్ము చేసుకొని తీరా సి ఎం ఆర్ గడువు దగ్గర పడగానే పి డి ఎస్ బియ్యం పని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది…ఈ పిడిఎస్ బియ్యం దందా మార్గాన్ని ఎక్కువగా నర్సంపేట, పర్వతగిరి మండలాల మిల్లర్లు కొనసాగిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తెలినట్లు తెలుస్తోంది..హసన్ పర్తి ఘటనతో విజిలెన్స్ అధికారులు సైతం వరంగల్ మిల్లులపై ఓ నజర్ వేసినట్లు తెలుస్తుంది…వరంగల్ పౌరసరఫరాల అధికారులు సైతం కొన్ని మిల్లుపై దృష్టి సారించి దాదాపు ఎనిమిది మిల్లుల్లో పిడిఎస్ బియ్యాన్ని గుర్తించినట్లు సమాచారం…వీరిపై చర్యలు తీసుకునేందుకు సివిల్ సప్లయీస్ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది…అధికారులు గుర్తించిన మిల్లుల్లో 4 క్వింటాల్లు మొదలుకొని 50 క్వింటాల్ల వరకు గుర్తించినట్లు సమాచారం… ఈ మిల్లర్ల పిడిఎస్ దందా పై అధికారులు నివేదిక సిద్ధం చేయగా ఆ మిల్లర్లు విచారణ ఎదుర్కొనేందుకు పౌరసరఫరాల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది…అధికారులు కొన్ని మిల్లుల్లో సకాలంలో పిడిఎస్ బియ్యం గుర్తించి తనిఖీలు చేయడంతో కొన్ని మిల్లులు గుట్టు రట్టు అయినట్లు ఐయ్యింది…

కఠిన చర్యలు తప్పవు…

…. వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి

మిల్లర్లు పిడిఎస్ బియ్యంతో దందా కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి అన్నారు…కొన్ని మిల్లుల పిడిఎస్ బియ్యం దందాపై న్యూస్10 ప్రతినిధి వివరణ కోరగా అదనపు కలెక్టర్ స్పందించారు… పిడిఎస్ బియ్యం ఏ మిల్లులో దొరికిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు…అధికారులు అందించిన నివేదిక ప్రకారం మిల్లర్ల పై చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here