డయాగ్నోస్టిక్స్ ,స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశామా…?డాక్టర్లకు కమిషన్ ఇచ్చి దందా కొనసాగించామా…?అన్నట్లు కొనసాగుతుంది వరంగల్ త్రినగరి లోని కొన్ని డయాగ్నోస్టిక్స్ స్కానింగ్ సెంటర్ల పరిస్థితి…దండిగా పైసలుం డి ,పరపతి కలిగి ఉండి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కాసిన్ని పరిచయాలు ఉంటే చాలు సర్కార్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా,అనుమతులు, ఇతర లైసెన్స్ లు ఏవి లేకున్నా నిరాటంకంగా దర్జాగా డయాగ్నోస్టిక్స్, స్కానింగ్ సెంటర్స్ ని నడిపియవచ్చని ఇక్కడ సెంటర్లు నడుపుతున్న వారిని చూస్తే అర్ధమవుతుంది… ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరించే ప్రయత్నాలు చేయడం…ఎం చేస్తారో చేసుకోండని సవాల్ విసరడం కొందరికి అలవాటుగా మారింది…సర్కార్ నిబంధనలు పాటించరు, సరైన అనుమతులు ఉండవు కాని అవసరమైతే ఓ సంఘం పేరుతో రంగం లోకి దిగి ఎదురుదాడి చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు… సరిగ్గా ఇలాగే హన్మకొండ నగరంలోని కొన్ని డయాగ్నోస్టిక్స్ ,స్కానింగ్ సెంటర్ల పద్ధతి ఇలాగే దాపురించింది…
అనుమతులు లేని విజేత…
హన్మకొండ నగరం నడిబొడ్డున విజేత డయాగ్నోస్టిక్స్, స్కానింగ్ పేరుతో సెంటర్ నిర్వహిస్తున్న ఆ సెంటర్ నిర్వాహకులు ఇప్పటివరకు ఆ సంస్థ పేరుతో ఎలాంటి అనుమతులు తీసుకోలేదు…అధిక రేడియేషన్ ఉన్న మిషన్స్ వాడుతు రోగులకు వైద్య పరీక్షలు చేస్తూ బాగానే వెనకేస్తున్నారు కానీ ఇప్పటివరకు విజేత డయాగ్నోస్టిక్స్ ,స్కానింగ్ సెంటర్ కు ఎలొర లైసెన్స్ లేదు…ఎలొర అనుమతులు లేకున్నా పెద్ద పెద్ద మిషన్స్ ఏర్పాటు చేసి సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా వీరు డయాగ్నోస్టిక్స్, స్కానింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు…..గత కొన్ని సంవత్సరాలుగా ఎలోరా లైసెన్స్( ఎలక్ట్రానిక్ లైసెన్సింగ్ అఫ్ రేడియేషన్ అప్లికేషన్స్ ) లేకుండా ఎక్స్ రే ,సి టి స్కాన్ ఎక్విప్మెంట్ ఉపయోగిస్తూ ఏ ఈ ఆర్ డి (అటామిక్ ఎనర్జీ రేగులటరీ బోర్డు) నిబంధనలకు విరుదంగా విజేత స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను హన్మకొండ కాకాజీ కాలనీ లో నిర్వహిస్తున్నారు.విజేత డయాగ్నోస్టిక్స్ ,స్కానింగ్ సెంటర్ వాడుతున్న సి టి స్కాన్ మెషిన్ జి ఈ హెల్త్ కేర్ అనే కంపెనీ నుండి కొనుగోలు చేసారు( సి టి స్కాన్ మెషిన్ మోడల్ జి ఈ రెవల్యూషన్ ఆక్ట్) ఈ మెషిన్ ను విజేత యాజమాన్యం ఎలోరా లైసెన్సు లేకుండా వాడుతోంది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ ఫర్ మెడికల్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్స్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ ఈ ఆర్ డి అటామిక్ ఎనర్జీ రేగులటరీ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను డి ఎం అండ్ హెచ్ ఓ లో సబ్మిట్ చేయాలి కానీ ఆలా చేయకుండానే వైద్య ఆరోగ్య శాఖ వద్ద విజేత స్కాన్స్ అండ్ దయాగ్నోస్టిక్స్ స్థానిక అనుమతులు తెచ్చుకుంది…కాని అసలు కావాల్సిన ఎలొర లైసెన్స్ మాత్రం విజేత యాజమాన్యం తెచ్చుకోలేదు…ఈ కీలకమైన లైసెన్స్ లు లేకుండా స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వీరికి సెంటర్ నడపడానికి అనుమతులు ఎలా ఇచ్చారో వారికే తెలియాలి…దీని వెనకాల ఉన్న మతలబు ఏంటో వైద్య ఆరోగ్య శాఖ అధికారులే సమాధానం చెప్పాలి….నిబంధనలకు విరుద్ధంగా ఉన్న,ఎలొర లైసెన్స్ లేకున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారి పరిధిలోని అనుమతులు చిటికెలో ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది…
అరకొర వసతులు ,ఇరుకైన గదులు…
విజేత అంతా నిబంధనలకు విరుద్ధమే….?
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎం చేస్తున్నట్లు….?
మరో సంచికలో



