మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి  కన్నుమూత

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు…కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని ఏ ఐ జి ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు..కాగా ఎల్లుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు..ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here