ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏ ఈ ఆర్ బి) ఎలొర అనుమతి లేకుండా హన్మకొండ నగరంలో యథేచ్ఛగా కొనసాగుతున్న డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్లకే హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వత్తాసు పలుకుతున్నట్లే కనపడుతుంది.. నోటీసులు,మెమో లు అంటూ కాలయాపన చేస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ ఈ ఆర్ బి ఎలొర అనుమతులు లేకుండా కొనసాగుతున్న న్యూస్10 కథనం ద్వార అధికారుల్లో కదలిక వచ్చినా అది తూతూమంత్రపు తనిఖీల లాగానే ఉన్నాయి… జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో కొనసాగిన ఈ తనిఖీలు నామమాత్రంగా కేవలం కనెక్ట్,విజేత డయాగ్నోస్టిక్స్ సెంటర్ లల్లో నిర్వహించి తనిఖీలు జరిగాయి అనిపించారు… ఈ తనిఖీల్లో “కొండను తవ్వి ఎలుకను పట్టిన” చందంగా డయాగ్నోస్టిక్స్ యాజమాన్యాలు ఏది చెపితే ఆది విని వచ్చినట్లు తెలిసింది…. ఏ ఈ ఆర్ బి కి చెందిన ఎలొర లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న విజేత డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ యాజమాన్యం చూపించిన ప్రోక్యూర్ మెంట్ అనుమతి పత్రాన్ని మహాప్రసాదంగా స్వీకరించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇదే అనుమతి పత్రం అంటూ న్యూస్10 ప్రతినిధికి వాట్సాప్ చేసి మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు…విజేత డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు పోయిన దారినే తిరిగొచ్చారు….పనిలోపనిగా కనెక్ట్ డయాగ్నోస్టిక్స్ యాజమాన్యానికి మాత్రం మెమో జారీ చేశారు…ఇక్కడ కూడా తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు …కనెక్ట్ కు ఏ ఈ ఆర్ బి అనుమతి ఉందా…? అని న్యూస్10 ప్రతినిధి అడిగితే సమాధానం చెప్పకుండా స్టార్ డయాగ్నోస్టిక్స్ నుంచి కనెక్ట్ డయాగ్నోస్టిక్స్ గా మార్చుకునేందుకు ఇచ్చిన అనుమతి పత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాట్సాప్ లో పంపించారు….
ఇదీ సంగతీ..
గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఈ ఆర్ బి ఎలొర అనుమతులు లేకుండా నడుస్తున్న విజేత డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ పై ఈనెల 23 న “విజేత ఎలొర ఎక్కడ”…? అంటూ న్యూస్10 ఓ కథనాన్ని వెలువరించింది…దింతో లైసెన్స్ విషయంలో అప్పుడే నిద్ర లేచిన యాజమాన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది… ప్రయత్నాలు అంటే ఎలొర లైసెన్స్ ప్రయత్నాలు కాదు…తాము స్కానింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేస్తున్నాం అనుమతి ఇవ్వండి అంటూ ఏ ఈ ఆర్ బి కి ధరఖాస్తు చేసుకున్నారు…ఈ దరఖాస్తును పరిశీలించిన ఏ ఈ ఆర్ బి అనుమతి ఇస్తూ ఈనెల 26 న ప్రోక్యూర్ మెంట్ లేఖను ఇచ్చింది…ఇదే లేఖను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ ఈ ఆర్ బి ఎలొర అనుమతి లైసెన్స్ లేఖ అనుకున్నారో లేక విజేత యాజమాన్యం అధికారులను తప్పుదారి పట్టించిందో తెలియదు కాని అదే లేఖను న్యూస్10 కు పంపించిన అధికారులు మేము తనిఖీ చేసాం అంటూ ఓ నోట్ పంపించారు..నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా విజేత డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ లో రేడియేషన్ అధికంగా ఉండే స్కాన్,సి టి స్కాన్ ఎక్విప్మెంట్ లు నడుస్తున్నాయి… జి ఈ హెల్త్ కేర్ కంపెనీ కి సంబంధించిన రెవల్యూషన్ ఆక్ట్ మోడల్ సి టి స్కాన్ మిషన్ ను ఎప్పుడో కొనుగోలు చేశారు…
వీటి ద్వారానే వైద్య పరీక్షలు చేస్తూ వసూళ్ల దందా చేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి…కాని విజేత డయాగ్నోస్టిక్స్ లో అసలు స్కానింగ్,సి టి స్కానింగ్ ఎక్విప్మెంట్ లేనట్లు కొనుగోలు చేస్తాం అనుమతి ఇవ్వండి అంటూ ఏ ఈ ఆర్ బి కి దరఖాస్తు చేసుకోవడం ఏంటో విజేత యాజమాన్యానికి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకే తెలియాలి…ఇన్ని సంవత్సరాలు గా ఏ ఈ ఆర్ బి ఎలొర లైసెన్స్ లేకుండా కొనసాగిన,కొనసాగుతున్న విజేత డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ ను ఎందుకు సీజ్ చేయరో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది…ఏ ఈ ఆర్ బి అనుమతి లేని కనెక్ట్ డయాగ్నోస్టిక్స్ ను అనుమతులు వచ్చేవరకు మూసివేయమని అధికారులు ఆదేశించరో కూడా అధికారులే సమాధానం చెప్పాలి… ఏ ఈ ఆర్ బి అనుమతి లేకుండా సిటి స్కాన్ లాంటి అధిక రేడియేషన్ ఉన్న ఎక్విప్మెంట్ లు ఇన్స్టాల్ చేసిన కనెక్ట్ యాజమాన్యానికి ఏ ఈ ఆర్ బి లైసెన్స్ రావాలంటే నెలల సమయం పట్టే అవకాశం ఉంది.అప్పటివరకు ఈ రెండు డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ అలాగే కొనసాగిస్తారా…ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అధిక రేడియేషన్ వల్ల ముప్పు వాటిల్లకుండా చర్యలు లేకుండా అవి అలాగే కొనసాగుతాయా…?వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమాధానం చెప్పాలి….ఈ రెండు డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్లే కాకుండా అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఇతర డయాగ్నోస్టిక్స్ ల్లో తనిఖీలు ఎప్పుడు…?వాటిపై ఎం చర్యలు తీసుకుంటారో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్ఫష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది….ప్రొక్యూర్ మెంట్ లేఖ తో నాటకం ఆడుతున్న విజేత డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ విషయంలో చర్యలు తీసుకోకుండా డి ఎం అండ్ ఎచ్ ఓ ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారో దీని వెనకాల ఉన్న మతలబు ఏంటో తెలియాల్సిఉంది…హన్మకొండ నగరంలో ఏ ఈ ఆర్ బి ఎలొర అనుమతి లేని డయాగ్నోస్టిక్స్ విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలి…
విజేతకు అనుమతులు లేవు…
డయాగ్నోస్టిక్స్ అండ్ రేడియాలజీ (ఏ ఈ ఆర్ బి) హెడ్ డాక్టర్ సహాని
హన్మకొండ నగరంలో కొనసాగుతున్న విజేత డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ కు ఎలొర లైసెన్స్ లేదని డయాగ్నోస్టిక్స్ అండ్ రేడియాలజీ (ఏ ఈ ఆర్ బి) హెడ్ డాక్టర్ సహాని స్పష్టం చేశారు…న్యూస్10 ప్రతినిధి ఫోన్ లో వివరణ కోరగా ఆయన స్పందించారు… ఎక్విప్మెంట్ కొనుగోలుకు మాత్రమే వారు అనుమతి పొందారని…ఏ ఈ ఆర్ బి నిబంధనలకు అనుగుణంగా ఎక్విప్మెంట్ ఇన్స్ట లేషన్ రేడియేషన్ కు తగ్గట్టుగా భవనం ఉంటే వాటిని పరిశీలించిన తర్వాత మాత్రమే ఏ ఈ ఆర్ బి ఎలొర లైసెన్స్ ఇస్తుందని ఆయన చెప్పారు….



