అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఓ ఎస్సై పై సస్పెండ్ వేటు వేశారు వరంగల్ సీపీ… ఎస్సై పై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించిన సీపీ అవి నిజమని తెలడంతో కొరడా ఝలిపించారు…వరంగల్ జిల్లా మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న యం సురేష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు..ఎస్. ఐ పై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణ లో రుజువు కావడంతో ఎస్. ఐ ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది…



