సహజీవనం చేస్తున్న జంటలకు కేంద్రం బంఫర్ ఆఫర్ ఇచ్చింది… సహజీవనం చేస్తున్న జంటలను కుటుంబం గానే గుర్తించనున్నట్లు కేంద్రం ప్రకటించింది… ఏప్రిల్ 1నుంచి జనగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ జనగణన లో సహజీవనం చేస్తున్న జంటలను కుటుంబం గానే పరిగణించనున్నారు…దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన-2027 ప్రక్రియ మొదటి దశ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా హౌజ్ లిస్టింగ్ – హౌజింగ్ సెన్సస్ (HLO)ను నిర్వహించనున్నారు. వివాహం చేసుకోకుండా చాలాకాలంగా కలిసి ఉంటున్న జంటలను ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహ జీవన జంటలను పెళ్లయిన దంపతులలాగే పరిగణించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు జనగణన నిబంధనల్లో కీలక మార్పులు చేశారు



