హన్మకొండ సివిల్ సప్లై శాఖలో ఓ అధికారి వ్యవహార శైలి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది…శాఖలో అధికారిక హోదా ఒకటే అయినా, కార్యాలయంలో జరిగే ప్రతి నిర్ణయం ఆయన కనుసన్నల్లోనే సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తనకు సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఈ అధికారి తన ఇష్టారాజ్యాంగ వ్యవహారిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి..ముఖ్యంగా మిల్లర్లు, రైస్ ట్రేడర్లు, రవాణాదారులు, గన్ని బ్యాగుల సరఫరాదారుల మధ్య “మహేంద్ర వ్యవస్థ” అనే మాట బహిరంగంగానే వినిపిస్తోందని సమాచారం.
ఆ ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు లెఫ్ట్ – రైట్..?
ఈ సారు పనులు చక్కదిద్ది వసూళ్లు చేయడానికి ఈ
శాఖలో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ఫైళ్లు కదలడం నుంచి బిల్లుల క్లియరెన్స్ వరకు ప్రతీ వ్యవహారంలో వారిదే తుది మాటగా మారిందని పలువురు చెబుతున్నారు. ఒకరు ఫీల్డ్ స్థాయిలో వసూళ్లు నిర్వహిస్తే, మరొకరు లెక్కలు, సెటిల్మెంట్ వ్యవహారాలు చూసుకుంటున్నారనే చర్చ బాగానే సాగుతోంది.శాఖలో జరుగుతున్న అనధికార వసూళ్లకు ఓ ప్రత్యేక వ్యవస్థే పనిచేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఏ పని ఎంతకు..? ఎవరి నుంచి ఎంత తీసుకోవాలి..? ఎవరికి ఎంత చేరాలి..? అనే అంశాలన్నీ ముందే నిర్ణయించబడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కొందరు మిల్లర్లు “డబ్బులు ఇవ్వకపోతే బిల్లులు ఆగిపోతాయి” అని ఆరోపిస్తున్నట్లు సమాచారం.
మాటల్లో అమాయకత్వం… వసూళ్లలో ఘనులు..?
బయటకు చాలా సాధారణంగా, అమాయకంగా కనిపించే ఈ ఇద్దరు టెక్నీకల్ అసిస్టెంట్ లు లో లోపల మాత్రం భారీ స్థాయిలో వసూళ్లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే వారితో మృదువుగా మాట్లాడి, తర్వాత మధ్యవర్తుల ద్వారా డిమాండ్లు పెడుతున్నారనే ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి.
గన్ని బ్యాగుల లెక్కల్లో భారీ గందరగోళం ..?
గన్ని బ్యాగుల కొనుగోలు, వినియోగం, నిల్వల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నతాధికారులకు అసలు లెక్కలు చేరలేదని, రికార్డుల్లో ఒకటి – వాస్తవంలో మరొకటి జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షల్లో గన్ని బ్యాగుల లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి ఆడిట్ అవసరమనే డిమాండ్ వినిపిస్తోంది.
శాఖలో భయాందోళనలు..!
కొంతమంది సిబ్బంది కూడా ఈ వ్యవహారాలపై లోలోపల అసంతృప్తిగా ఉన్నప్పటికీ, “ఎదురుగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి” అనే భయంతో నోరు విప్పడం లేదని సమాచారం. ఆ అధికారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో పలువురు మౌనం పాటిస్తున్నారనే చర్చ సాగుతోంది.
ఉన్నతాధికారులు స్పందిస్తారా..?
హన్మకొండ సివిల్ సప్లై శాఖలో అవినీతి జరుగుతున్నట్లు, ఆ అధికారి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణల పై ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. గన్ని బ్యాగుల లెక్కలు, బిల్లుల క్లియరెన్స్, వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. శాఖలో పారదర్శకత తీసుకురాకపోతే మరిన్ని అక్రమాలు జరిగే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.




