హన్మకొండ డి ఆర్ డి ఏ లో శాశ్వత డిప్యూటేషన్ కథ సాగుతుంది.. బదిలీ అనేది లేకుండా ఏడుగురు ఉద్యోగులు దాదాపు పాతికేళ్లుగా తిష్ట వేసుకొని ఉన్నారు.. డిప్యూటేషన్ పై వచ్చిన ఉద్యోగులు రెండు సంవత్సరాలలో మాతృ శాఖకు వెళ్లాలని నిబంధన ఉన్న వీరు మాత్రం డి ఆర్ డి ఏ ను వదలమంటున్నారు… వచ్చే కొద్ది రోజుల్లో బదిలీల ప్రక్రియ ఉండగా ఈసారైనా వీరికి బదిలీ అవుతుందా… వారు వారి మాతృ సంస్థ కు వెళ్తారా…? అనేది భేతాల ప్రశ్నగా మారింది.. పంచాయతీ రాజ్ శాఖ నుంచి వచ్చిన వీరు సొంత శాఖ (డి ఆర్ డి ఏ )లో పనిచేస్తున్న వారిని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి… వారి పోస్టుల్లోకి ఎవరు రాకుండా అడ్డుకుంటున్నారని, కలెక్టరెట్ నుంచి సెక్రటరియట్ వరకు తమకు పెద్ద పైరవి ఉందని ఓ ఇద్దరు డిప్యూటేషన్ ఉద్యోగులు విర్రవీగుతున్నట్లు తెలిసింది.. ఈ నేపథ్యంలో ఇంతకీ ఈ సారైనా వీరికి బదిలీ ఉంటుందా..? అనే చర్చ డి ఆర్ డి ఏ ఉద్యోగుల్లో కొనసాగుతుంది.
అవును..హన్మకొండ డి ఆర్ డి ఏలో డిప్యూటేషన్ ఉద్యోగుల పెత్తనం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా కొంతకాలం మాత్రమే కొనసాగాల్సిన డిప్యూటేషన్ విధులు, ఇక్కడ మాత్రం పాతికేళ్లుగా శాశ్వత పోస్టుల్లా మారిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాతృ శాఖకు వెళ్లకుండా, బదిలీలు వచ్చినా కదలకుండా అదే శాఖను అంటిపెట్టుకొని కొనసాగుతున్న ఇద్దరు ఉద్యోగుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ, కొందరు అధికారుల అండతోనే ఇంకా కొనసాగుతున్నారనే చర్చ శాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
డిప్యూటేషన్ ల సాగదీత వ్యవహారం… ఆ ఇద్దరు ఉద్యోగుల అతి, అవినీతి పై బ్లాస్టింగ్ ప్రత్యేక కథనం న్యూస్ 10 సంచికలో….



