ఏ ఎఫ్ పి ఐ ఈ సి మెంబర్ గా డా:పవన్ వరయోగి

ఏ ఎఫ్ పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గానికి డా. పవన్ వరయోగి ఎన్నిక

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన వరంగల్ వైద్యుడు

ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ లక్ష్యంగా కృషి చేస్తామన్న డా. పవన్

రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీలో ఫ్యామిలీ మెడిసిన్ విభాగం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గానికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. పవన్ వరయోగి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వైద్య వర్గాలు, సహచరులు, శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలిపారు.ఎన్నిక అనంతరం డా. పవన్ వరయోగి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యామిలీ మెడిసిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన, సమగ్ర వైద్య సేవలు అందించడంలో ఫ్యామిలీ మెడిసిన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
“ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్” అనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీలో ఫ్యామిలీ మెడిసిన్ విభాగాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో, కుటుంబ కేంద్రిత వైద్య సేవలను అందించడంలో ఫ్యామిలీ మెడిసిన్ అత్యంత కీలకమని ఆయన వివరించారు. ఒకే వైద్యుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.
ఏ ఎఫ్ పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రాష్ట్రంలో ఫ్యామిలీ మెడిసిన్ విభాగం అభివృద్ధికి కృషి చేస్తానని డా. పవన్ వరయోగి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here