అటవీ శాఖలో పర్సెంటేజీల అధికారి…?

అటవీ శాఖలో యూనియన్ నేత పర్సెంటేజీల మేత..?

ములుగు జిల్లా అటవీ శాఖలో ఓ ఇంచార్జ్ రేంజ్ అధికారి వ్యవహారశైలిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుండాల్సిన యూనియన్ నాయకుడే ప్రతి పనిలో పర్సెంటేజీలకు ప్రాధాన్యం ఇస్తూ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు శాఖలో కలకలం రేపుతున్నాయి. కాంట్రాక్టు పనుల్లో తన డ్రైవర్‌ను బినామీ కాంట్రాక్టర్‌గా రంగంలోకి దించి పనులు చేయించడం నుంచి, బీట్ అధికారుల వద్ద పై అధికారుల నిర్వహణ పేరుతో వసూళ్లు చేయడం వరకు అనేక అంశాలు శాఖలో చర్చనీయాంశంగా మారాయి.

అటవీ అవినీతిని అరికట్టాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తే అక్రమాలకు కేంద్రబిందువుగా మారారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా పరిధిలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై పూర్తి వివరాలతో, సంబంధిత ఆధారాలతో ప్రత్యేక కథనం న్యూస్10 సోమవారం సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here