ఒక పట్టణం..ముప్పై బెల్ట్ షాపులు

నర్సం పేటలో బెల్ట్ షాప్ ల జోరు
ఓ వైపు మద్యం వ్యాపారుల సిండి కెట్ ,మరో వైపు బెల్ట్ షాపుల హవా..
ఒక్క పట్టణం లోనే ముప్పై బెల్టు షాపులు
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు
బెల్ట్ షాపులకు అనుమతి లేదంటున్న వరంగల్ రూరల్ సుపరిండెంట్ శ్రీనివాస్

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బెల్ట్ షాపులు జోరుగా కొనసాగుతున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై బెల్టు షాపులు రాత్రి0 బవళ్ళు అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. పట్టణంలో ఓ వైపు వైన్ షాపులు సిండికేట్ తో అమ్మకాలు కొనసాగిస్తుంటే బెల్టు షాపులు అమ్మకాలతో మద్యం ప్రియుల ఒళ్లు ఇళ్లు గుల్లచేస్తున్నారు.ఒక పట్టణం..ముప్పై బెల్ట్ షాపులు- news10.app

బెల్టుషాపుల జోరు…

నర్సంపేట పట్టణంలో దాదాపుగా 30 బెల్టుషాపుల వరకు జోరుగా మద్యం అమ్ముతూ మందుబాబుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి. అయితే ఈ బెల్టుషాపుల అమ్మకాలను అదునుగా చేసుకొని, మద్యం ప్రియులను ఆసరాగా చేసుకుని వైన్ షాపుల యజమానులు ఎమ్మార్పీ ధర కంటే పది రూపాయలు ఎక్కువగా అంటే ఒక్క బీరు పది రూపాయలు మరియు ఏ మందు క్వార్టర్ కైనా పది రూపాయల ధరను పెంచి ప్రభుత్వం అమలు చేసిన ధరలను తుంగలో తొక్కి అమ్మకాలను కొనసాగిస్తున్నారు. దింతో బెల్టుషాపులుతమ ఇష్ట రీతిన ఏమార్పిపై 30 నుంచి 50 రూపాయల కు పైగానే వసూలు చేస్తు మద్యం ప్రియులనుంచి దంకుంటున్నారు. ఎప్పుడు తలుపు తడితే అప్పుడు మద్యం విక్రహిస్తూ ఇరవై నాలుగు గంటలు బెల్టుషాపులు తమ ఆక్రమ దందా కొనసాగిస్తూన్నాయి.

ఎక్సైజ్ అధికారులు ఎక్కడ..?

నర్సంపేట పట్టణంలో ఇంతటి బహిరంగంగా బెల్ట్ షాపులు అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. కాగా ఇది మొత్తం ఎక్సైజ్ అధికారులు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని ఆరోపణలు వినవస్తున్నాయి. కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయని అధికారులే బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నిజానికి అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఉన్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా బెల్టుషాపులు మద్యాన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నాయని, నర్సంపేట లో మద్యం కల్తీపై ఇప్పటికే న్యూస్ 10 వార్తా కథనం వెలువరించడం జరిగింది. దింతో ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరంగల్ రూరల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ న్యూస్ టెన్ ప్రతినిధితో చెప్పారు. కానీ ఇంతవరకూ ఏ చర్య కూడా తీసుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది.. మద్యం సిండికేట్ దందా పై కూడా అధికారులు ఇప్పటివరకు ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదు.

ఇవిగో బెల్ట్ అడ్డాలు…

నర్సంపేట లోఒక్క మల్లంపల్లి రోడ్ లోనే 11 బెల్టుషాపులు, మాదన్నపేట రోడ్డులో 5 బెల్టుషాపులు, పాకాల రోడ్డు లో నాలుగు బెల్టుషాపులు, కమలాపురంలో ఐదు బెల్టుషాపులు, మహబూబాబాద్ రోడ్డు లో నాలుగు బెల్టుషాపులు, నెక్కొండ రోడ్డు లో ఒక్కబెల్టు షాపు ఇలా దాదాపుగా నర్సంపేట టౌన్ లో ఉన్న బెల్ట్ షాపులు ముప్పై. ఇక నర్సంపేటరూరల్ లో ఎన్ని ఉన్నాయో….వాటి వల్ల ఎంత మంది మందుబాబుల జేబులు గుల్ల అవుతున్నాయో…. వారి ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో అర్ధమవుతుంది. ఇలా నర్సంపేట లోని వైన్స్ షాపుల యజమానులు మద్యం సిండికేటుకు తెరలేపి కోట్లకు పడగలెత్తుతున్నారు అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇకనైనా అధికారులు ఈ సిండికేట్ మహమ్మారిపై చర్యలు తీసుకోవాలని నర్సంపేటలో బెల్టుషాపులు లేకుండా చూడాలని నర్సంపేట ప్రజలు కోరుతున్నారు.

బెల్టు షాపులకు అనుమతి లేదు……..

నర్సంపేట పట్టణంలో బెల్టు షాపులకు ఎటువంటి పర్మిషన్ లేదని వరంగల్ రూరల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ న్యూస్ 10 కు స్పష్టం చేశారు. బెల్టుషాపులు మద్యం సిండికేట్లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.