పోలీసన్న జరభద్రం…..

విధుల్లో ఉన్న పోలీసుల్లో కలవరం ..దేశ వ్యాప్తంగా ఇదే స్థితి
కనీస జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా బారిన పడకుండా ఉం టారు
నిత్యం ప్రజలతో సంబంధం ఉండే పోలీసులకు కనీస సౌకర్యాలు కల్పించాలి
హైదరాబాద్ లోని బంజారాహిల్స్, తపాచబుత్ర పోలీస్ స్టేషన్ లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదు.

నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండే పోలీసన్న ప్రస్తుతం కరోన మహమ్మారి మూలంగా కలవరపడుతున్నాడు. విధుల్లో ఉండే పోలీసులు ఎలాగూ ప్రజలతో మమేకం కాకతప్పదు. దింతో కరోన బారిన కొంతమంది పోలీసులు పడడంతో రాష్ట్ర పోలీసు శాఖలో కలవరం మొదలైంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుండగా మహారాష్ట్రలో అధికంగా పోలీసులు కరోన బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి మెల్ల మెల్లగా తెలంగాణ రాష్ట్రములో సైతం పెరుగుతుపోతుంది దింతో పోలీసులు ఆందోళనకు గురైతున్నారు. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో ఈ పరిస్థితి మరింత ఆందోళన కరంగా తయారైంది. జిఎచ్ ఎం సీ పరిధిలో రోజు రోజుకు కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుండడం వీరిలో పోలీసులు సైతం ఉండడం గమనార్హం. కరోన పరిస్థితి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చు తుండడంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విధులు నిర్వర్తించడంతో పాటు కరోన రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై సైతం పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.పోలీసన్న జరభద్రం.....- news10.app

గన్ మెన్లు జాగ్రత్త…

ప్రజా ప్రతినిధులు, ఇతర వీఐపీలు, పోలీసు అధికారుల వద్ద విధులు నిర్వహిస్తున్న గన్ మెన్ లు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న, విధులు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకంటే వీరే ముందు వరుసలో ఉంటారు. ప్రజలు కలిసేందుకు వచ్చినా, జనాలు అధికంగా ఉన్న వీరే అదుపుచేస్తూ ఉంటారు. కనుక వీరి అత్యంత జాగ్రత్తగా ఉంటేనే బారినుంచి బయట పడుతారు లేదంటే బాధలు పడాల్సివస్తుంది. ఇటీవల హైదరాబాద్ గోశామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మెన్ కరోన బారిన పడిన విషయం తెలిసిందే. దింతో గన్ మెన్ లు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది.

పోలీస్ శాఖ సౌకర్యాలు కల్పించాలి

కరోన వేళా నిద్రాహారాలు మాని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రాష్ట్ర పోలీసు శాఖ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం వుంది. విధుల్లో ఉన్న పోలీసులకు మాస్కు లు, సానిటైజేర్ లు,ఇతర సదుపాయాలు కల్పించాలి. ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 21 మంది పోలీస్ కానిస్టేబుళ్ల కు కరోన పాసిటివ్ గా నిర్దారణ ఐయింది. వీరిలో పోలీసు అధికారులు సైతం ఉన్నారు. అలాగే తాజాగా హైద్రాబాద్ లోని టపాచ బుత్ర పోలీస్ స్టేషన్ కు చెందిన స్టేషన్ అధికారితో సహా 12 మంది కరోన బారిన పడ్డారు. మొన్నటివరకు దేశం లోని మహారాష్ట్రాలో అత్యధికంగా పోలీసులకు కరోన సోకింది .ఇక్కడ ఇప్పటివరకు నాలుగు వేల మంది కరోనాబారిన పడగా, చికిత్స తో మూడు వేల మంది కొలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.1001 మంది పోలీసులు వేర్వేరుగా చికిత్స పొందుతున్నారని తెలిసింది. పొరుగు రాష్ట్రాల్లో కరోన పరిస్థితి ఇంతటి భయానకంగా ఉండగా పోలీసులు సైతం దీని బారిన అధిక సంఖ్యలోనే పడ్డారు కనుక పోలీసులు ముందు జాగ్రత్తలు బాగానే పాటించాల్సి న అవసరం వుంది. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వం సైతం పోలీసులకు సౌకర్యాలు కల్పించాలి. విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో ధైర్యం కల్పించి వారి కుటుంబాల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.కరోన బారిన పడిన పోలీసులను ఆదుకొని వారికి మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని పోలీసు కుటుంబాలు కోరుతున్నాయి. ఆర్థికంగా చితికిపోకుండా ప్రభుత్వం విద్య పరమైన ధీమాను కల్పించాలని అంటున్నారు.నిత్యం విధుల్లో తలమునకలైయె పోలీసులు విధులతోపాటు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.