ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును మానుకోవాలి

కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలి
ప్రభుత్వ వైస్ చాన్సర్లనులను వెంటనే నియమించాలి
తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రాంమూర్తి
తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం వరంగల్ లో జిల్లా ఉపాధ్యక్షుడు ఉసిల్ల కుమార్ అధ్యక్షతన జరిగినది

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి హాజరై తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీల ను ఏర్పాటు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు అందని ద్రాక్షలా విద్య మారిపోతుంది అన్నారు. అగ్రవర్ణాల కోసం ఐదు యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందన్నారు కెసిఆర్ ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానంటూ ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.

ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును మానుకోవాలి- news10.app

ప్రభుత్వ యూనివర్సిటీలలో వసతులు కరువయ్యాయి అన్నారు ఇప్పటికి వైస్ ఛాన్స్లర్ నియామకం జరగలేదన్నారు. వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీలను అన్ని రకాల హంగులతో పునర్ నిర్మాణం చేయాలని వైస్ ఛాన్స్లర్ లను నియమించాలని కోరారు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు మానుకోకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ సాదు రాజశేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి శ్యాంరాజ్ సుకుమార్ ప్రకాష్ రమేష్ బన్న యాదగిరి ఉసిల్ల నర్సింగరావు మల్లయ్య కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.