నగర శివార్లలో… నాటుసారా మాఫియా…!

లాక్ డౌన్ సమయంలో రెచ్చిపోతున్న గుడుంబా తయారీదారులు
మొన్నటిదాకా మద్యం బంద్… ప్రస్తుతం పెరిగినరేట్లతో వీరికి పండగే పండగ
జాన్ పాక,గొర్రెకుంట శివార్లలో గుడుంబా తయారీ కేంద్రాలు
పోలీస్ సార్లతో సంబంధాలు…. పెట్టుకుంటారు వదిలేస్తారు.
అసలే కరోన సమయం…శివార్లలో గుంపులు గుంపులుగా చేరి గుడుంబా తాగుతున్న మద్యం ప్రియులు
పెరిగిన లిక్కర్ రేట్లతో నాటు సారా మత్తులో చిత్తవుతున్న యువత.

నగర శివార్లలో నాటుసారా మాఫియా రెచ్చిపోతోంది. లాక్ డౌన్ కారణంగా మద్యం రేట్లు పెరగడం, సాయంత్రం 6 గంటల వరకే మద్యం అమ్మకాలు కొనసాగుతుండడం వీరికి అందివచ్చిన వరంగా మారింది. దింతో గ్రేటర్ వరంగల్ శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని గుడుంబా తయారీ బట్టీలను ఏర్పాటు చేసి సంపాదనకు తెగబడ్డారు నాటుసార మాఫియా ఘనులు.

శివారు ప్రాంతాలే అడ్డా…!

నాటు సారా తయారీ కోసం మాఫియా ఘనులు నగర శివారు ప్రాంతాలను ఎంచుకున్నారు. శివార్ల లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో గుడుంబా బట్టీలను ఏర్పాటు చేసి అక్కడినుంచి నగరంలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. చుట్టూ మనుషుల కాపలాతో డ్రమ్ములు, పొయ్యిలను ఏర్పాటు చేసి లీటర్లకొద్ది గుడుంబాను తయారీ చేస్తున్నారు. లీటర్ సారాను 50 రూపాయలకు విక్రహిస్తున్నారు. నగర శివారులోని గొర్రెకుంట, జాన్ పాక గ్రామ శివార్లలో అడ్డగోలుగా ఈ దందా కొనసాగుతుంది. ఈ దందాను ప్రశ్నిస్తే నాటుసారా మాఫియా భౌతిక దాడులకు, బెదిరింపులకు దిగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాటుసారా తయారితో మాఫియా ఘనులు కోట్లకు పడగలెత్తి అన్నిరకాలుగా సహకారాలు ప్రముఖుల నుంచి పొందుతూ నాటుసారా తయారీ కేంద్రాలను నిర్వహిస్తూ పోలీసులకె వీరు పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసురుతున్నారు.

నగర శివార్లలో... నాటుసారా మాఫియా...!- news10.app

లాక్ డౌన్ పండగే… పండగ

లాక్ డౌన్ వేళా మద్యం అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేయగా ఆ సమయంల్ ఈ నాటు సార మాఫియా భారీగానే వెనుకేసుకుందట. మద్యానికి బానిసైన యువత సైతం నాటు సారా తయారీ కేంద్రం వద్దకు వెళ్లి కొనుగోలు చేసి అక్కడే గుడుంబా తాగడం న్యూస్10 కంటపడింది. గుంపులు గుంపులుగా చేరి మద్యం ప్రియులు గుడుంబా తాగడం కరోన వేళా ప్రమాదకరమే అయిన గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారీదారులు ఇక్కడే విక్రయాలు కొనసాగిస్తున్నారు. దింతో మత్తులో యువత సైతం చిత్తై పోతున్నారు. లిక్కర్ కంటే తక్కువ ధరకు కావాల్సినప్పుడల్లా దొరుకుతుందని కొందరు యువకులు గుడుంబాను తాగుతూ నిత్యం మత్తులో జోగుతున్నారు.నగర శివార్లలో... నాటుసారా మాఫియా...!- news10.app

పోలీసులు పట్టుకుంటారు… వదిలేస్తారు

నగర శివార్లలో గుడుంబా తయారీ కేంద్రాలు ఉన్నట్లు పోలీసులకు తెలుసు. గ్రామస్తులు వీరికి తరుచుగా సమాచారం చేరవేస్తూనే ఉంటారు. అయితే వీరు అడపాదడపా అటువైపు వెళ్లి వారిని బెదిరిస్తున్న అదుపులోకి తీసుకున్న ఆతర్వాత వదిలేస్తే వీరు మళ్ళీ నాటుసార తయారీని ప్రారంభిస్తున్నారు. ఇక ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇటువైపు తొంగిచూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పట్టుకున్న ఐదు పది వేలు సమర్పిస్తే ఎవరైనా వదిలేస్తారని నాటు సార మాఫియా పోలీసులు, ఎక్సైజ్ అధికారుల తీరుపై వ్యాఖ్యలు చేస్తోంది. ఇకనైనా ఈ మాఫియాపై దృష్టి సారించి వీరి తయారీని అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.