వీడని చిక్కు ముడి..!

తొమ్మిది మంది మృతి లో ఫోరెన్సిక్ నివేదిక వస్తే కేసులో మరింత పురోగతి
కాల్ డేటా ఆధారంగా ఇద్దరు బిహారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సంఘటనకు ముందు పెనుగులాట జరిగిందన్న ఫోరెన్సిక్ వైద్యులు, నలుగురు మృతుల ఒంటిపై గాయాలు

వీడని చిక్కు ముడి..!- news10.app

గొర్రెకుంట సుప్రియ కోల్డ్ స్టోరేజీ బావిలో పడి మరణించిన 9 మంది మృతికేసులో ఇంకా చిక్కు ముడి వీడలేదు. ఈ సంఘటనపై పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి విచారణ జరుపుతుండగా కేసులో కొంత పురోగతి కనిపించిన, చిక్కు ముడి మాత్రం ఇంకా వీడలేదు. సంఘటన అసలు ఎలా జరిగింది కారకులెవరు అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దృష్టి సారించారు. మాక్సుద్ కాల్ డేటా ఆధారంగా ఇద్దరు బిహారీ యువకులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ యాదవ్, మోహన్ ఈ బిహారీ యువకులను తీసుకొని పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. సంఘటనకు ముందు మృతుడు మాక్సుద్ బిహారీ యువకులతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో ఈ ఇద్దరు బిహారీ యువకుల వాంగ్మూలం కీలకంగా మారనుంది.

బావిలోనే తుదిశ్వాస విడిచారు – ఎంజీఎం ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజా మాలిక్

గొర్రెకుంట సంఘటనలో తొమ్మిది మంది బావిలోనే తుది శ్వాస విడిచినట్లు ఎంజీఎం ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజా మాలిక్ మీడియాకు చెప్పారు. ఊపిరితిత్తుల లోకి నీరు చేరడం వల్లే వీరు చనిపోయారన్నారు. కాగా వీరిపై ఫుడ్ పాయిజన్ జరిగిందా…లేదా తెలాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలన్నారు. నలుగురు మృతుల ఒంటిపై గాయలున్నాయన్న ఆయన ఈ సంఘటనకు ముందు పెనుగులాట జరిగిందని బావిస్తున్నామన్నారు. అన్ని వివరాలు స్పష్టంగా తెలియాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలని ఇది రావడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందన్నారు.