ఆ చిన్నారి పేరు లాక్ డౌన్

కరోన వైరస్ కారణంగా దాదాపు ప్రపంచమే లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కూర్చుంది. ఎవరు గడపదాటి బయటకు రాకుండా ఇంట్లోనే గడుపుతున్నారు.మరో వైపు వివిధ వ్యాపారాల కారణంగా అనేక మంది తమ ఇంటికి దూరమై వేరే ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా ఇరుక్కు పోయారు. వీరిలో వలస కార్మికుల పరిస్థితి మరీ దయనియం.. ఇలాగే రాజస్థాన్ రాష్ట్రం ఆళ్వార్ ప్రాంతానికి చెందిన 13 కుటుంబాలు ప్లాస్టిక్ అలంకరణ వస్తువులు అమ్ముకోవడానికి వెళ్లి లాక్ డౌన్ కారణంగా త్రిపుర రాష్ట్రంలోని బాధర్ ఘాట్ ప్రాంతంలోనే ఉండిపోవాల్సివచ్చింది. వీరిలో ఒక మహిళ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే లాక్ డౌన్ సమయంలో పుట్టిన ఈ బిడ్డకు తల్లి తండ్రులు లాక్ డౌన్ అంటూ నామకరణం చేశారు.