అక్షరంపై బూతు…

ఇది ఓ ఎమ్మెల్యే అనుచరుడి బరితెగింపు…అధికారం లో ఉన్నాం ఎమ్మెల్యే అండగా ఉన్నాడు ఎం చేసిన చెల్లుతుందనే పొగరు…వార్తలు రాసిన జర్నలిస్టులను నోటికీవచ్చినట్లు తిట్టిన ఎవరు ఏంచేయలేరనే ధైర్యం .ప్రజలు కట్టబెట్టిన పదవిని అడ్డంగా పెట్టుకొని ఏదైనా చేయచ్చు అనే అతితెలివి…అందుకే న్యూస్10 లో సోమవారం ప్రచురితం ఐయిన “గులాబీ నేత శృంగార పాఠాలు ” కథనం ఓ సర్పంచ్ కు ఎక్కడ లేని కోపం తెచ్చిపెట్టింది… ఫోన్ లో వివాహిత మహిళతో బూతులు మాట్లాడుతూ శృంగార పాఠాలు చెప్పిన గులాబీ నేతకు దగ్గరివాడిగా పేరున్న ఆత్మకూర్ మండలం నీరుకుళ్ల సర్పంచ్ బలరాం న్యూస్10 కథనంపై అంతెత్తున ఎగిరిపడ్డాడు…సోమవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో న్యూస్10 బ్యూరో కు ఫోన్ చేసిన సర్పంచ్ ఫోన్ ఎత్తి హలొ అనగానే బూతు పురాణం అందుకున్నాడు…చెప్పలేని విదంగా వ్యక్తిగతంగా దూషిస్తూ తన వక్రబుద్దిని చాటుకున్నాడు…తమ వైస్ ఎం పి పి చేసింది ఎదో పుణ్యకార్యం ఐయినట్లు వార్త ఎందుకు రాశారు అనే విదంగా బూతులు అందుకున్నాడు…పీకలదాక మద్యం సేవించి ఫోన్ చేసి బూతులు తిడుతూ తనను ఎవరేమి చేయలేరనే ధీమాతో తాను తిట్టేది రికార్డ్ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చాడు …ఎక్కడి విలేకరి వి…ఎం విలేకరివి అంటూ తన అక్కసు మొత్తం వెళ్లగక్కుతూ శృంగార పాఠాల గులాబీ నేతకు వంత పాడాడు…బూతు మాటల నేతకు దగ్గరివాడిగా పేరున్న ఈ సర్పంచ్ ఆ నేత ఏంచేసిన సమర్దించడంలో ముందు వరుసలో ఉంటాడని తెలిసింది…గతంలో కూడా ఇతగాడు కొంతమంది విలేకర్లను ఇష్టారీతిన దూషించినట్లు తెలిసింది…

అక్షరంపై బూతు...- news10.app

భయపడేది లేదు…

జనం తరపున వకాల్తా పుచ్చుకొని ముందుకు నడుస్తున్న న్యూస్10 ఓ సర్పంచ్ బెదిరింపులకు, బూతులకు తాటాకు చప్పుళ్లకు బయపడదని స్పష్టం చేస్తున్నాం..దిగజారుడు మాటలు మాట్లాడే ఇలాంటి నాయకులకు జనమే ప్రజాస్వామ్య పద్దతిలో ఎప్పుడో ఒకప్పుడు తప్పక బుద్ధి చెప్తారనే న్యూస్10 భావిస్తోంది..ప్రజాస్వామ్యం పై అంతటి అపారమైన గౌరవాన్ని, నమ్మకాన్ని న్యూస్10 కలిగివుంది….సర్పంచ్ బూతు పురాణాన్ని ఆ సర్పంచ్ విజ్ఞతకే వదిలేస్తున్నాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here