బొల్లికుంటలో కుల బహిష్కరణ

గౌడ సంఘము నుండి నాలుగు కుటుంబాలను బహిష్కరించిన కుల పెద్దలు
గౌడ సంఘము భూమి విషయంలో వివాదం
సంఘ సభ్యులు 64 మంది డబ్బులు పంచుకుంది 60 మంది
కలెక్టర్, సీపీ ని కలిసిన న్యాయం జరగడం లేదని బాధితుల ఆరోపణ
కులబహిష్కరణ విషయంలో కేసులు నమోదు చేసేందుకు సెక్షన్ లేవని పోలీసుల బుకాయింపు

బాధితుల ఆరోపణ మనోవేదనకు గురైతున్నామంటు ఆవేదన

సంగెం మండలం బొల్లికుంటలో గౌడ కుల సంఘం పెద్దలు ఓ వంద సంవత్సరాలు వెనక్కి వెళ్లారట..ఇది ఆధునిక కాలం అనే మాటమరచి ఆటవిక కాలంలో కూడా ఏ మనుషులు చేయని పని చేశారని బాధితులు ఆవేదన చెందుతున్నారు కేవలం తమకు రావాల్సిన డబ్బులు అడిగినందుకు కులం నుంచి బహిష్కరించి పైశాసిక ఆ నందం పొందుతున్నారని బాధితులు ఆరోపించారు .

బొల్లికుంటలో కుల బహిష్కరణ- news10.app

అసలేం జరిగింది…?

సంగెం మండలం బొల్లికుంటకు చెందిన గౌడ సంఘానికి బొల్లికుంటలోనే 14 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. భూమి పై సంఘంలో ఉన్న 64మంది సభ్యులకు భాగస్వామ్యం ఉంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ ప్రాంతంలో రియలేస్టట్ బూమ్ కాస్త పెరగడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.దీంతో సంఘం పెద్దలకు భూమిని కొంత అమ్మాలనే ఆలోచన పుట్టిందట ఆలోచన వచ్చిన తడవుగానే ఎకరం 50 లక్షల చొప్పున ఆరేకరాల ఆరు గుంటల భూమిని అమ్మేశారు.వచ్చిన మొత్తాన్ని 60 మంది సభ్యులకు పంచేసారు కోల.శ్రీనివాస్ , పెరుమాండ్ల. సతీష్ బాబు , పెరుమాండ్ల. రాజు మరో వ్యక్తి ఇలా నలుగురికి మాత్రం డబ్బులు ఇవ్వకుండా కుల పెద్దలు నిలిపివేశారు… దీనికి కారణం కుల పెద్దలు 70 లక్షలకు ఎకరం భూమి అమ్మి సభ్యులను మోసం చేసి 50 లక్షలకే ఎకరం భూమి అని వచ్చిన మొత్తాన్ని పంచారని వీరు ఆరోపించడం పాపమై పోయిందట.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుల పెద్దలు మా పెత్తనాన్నే ప్రశ్నిస్తార…అంటూ నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధితులు న్యూస్10 కు తెలిపారు. కుల పెద్దలు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తాము కుల బహిష్కరణకు గురైయామంటు వారు అన్నారు.

పోలీసులను ఆశ్రయించిన దక్కని న్యాయం…

తమను అన్యాయంగా దోషులను చేస్తూ కుల బహిష్కరణ చేస్తే పోలీసులను ఆశ్రయించి జరిగింది వివరించిన న్యాయం దక్కలేదన్నారు.. మామునురు పోలీసులకు ఈ విషయమై పదే పదె పిర్యాదు చేసిన లాభం లేకుండా పోయిందని బాధితులు ఆరోపించారు. కుల బహిష్కరణకు కేసు లేదని స్వయంగా మామునుర్ ఏ సి పి చెప్పారని వారు అన్నారు. ఇకనైనా మాకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.