సిఐ సాబ్ వసూల్ ఏజెంట్లు…?

మట్టి ఇసుక అక్రమార్కుల దగ్గర మామూళ్ల వసూల్ కోసం ఎజెంట్లను నియమించుకొన్న ఓ సిఐ సాబ్..?
నెల నెలా వారే వసూలు చేసి పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారట
రోజువారీగా తీసుకుంటే అందరికీ తెలుస్తుందని మామూళ్ల వాటా నెల వారీగా మార్చడట…!
నెలలో ఆలస్యం ఐయిందా…ట్రాక్టర్లు సీజ్ చేయడమే..
ప్రధాన రహదారిపై ఉన్న ఓ పోలీసుస్టేషన్ సీఐ సాబ్ ఘనకార్యామిది…?

సిఐ సాబ్ వసూల్ ఏజెంట్లు...?- news10.app చొక్కా నలిగేది లేదు..
కడుపుల చల్ల కదిలేది లేదు
శ్రమ పడేది లేదు
చెమట కార్చేది లేదు
కానీ ఆదాయం మాత్రం దండిగా వస్తోంది. నెల నెలా ఏజెంట్ల ద్వారా నడిసొస్తోంది. ఎం చేయాల్సిన అవసరం లేదు చూసి చూడనట్లు ఉంటే చాలు. అక్రమంగా మట్టి ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లను వదిలితే చాలు. అప్పనంగా లక్షల రూపాయలు మామూళ్ల రూపంలో వచ్చిపడతాయి. ఇది నగరంలోని ఓ సీఐ సాబ్ భారీ ఆదాయ కహానీ… సర్కారీ వారి జీతం ఎంతుందో మనం చెప్పలేం కానీ మట్టి ఇసుక దందా నడిపిస్తున్న ట్రాక్టర్ యజమానులు మాత్రం నెల నెలా అందిస్తున్నది జీతాన్ని దాటి పోతుందట అంటే ఏతా వాత తేలేదేంటంటే.. అదేదో పాత పాటలో చెప్పినట్లు ఆ సిఐ సాబ్ కు జీతం కంటే గీతం ఎక్కువనట్లు. ఈయనగారికి ఇంత మొత్తంలో దండిగా సమర్పించుకుంటున్నారు కనుక మట్టి ఇసుకతో నాసిరకం సరుకుతో ట్రాక్టర్లు దర్జాగా నగరంలోకి ప్రవేశిస్తూన్నాయి అన్నమాట. తెల్లవారుజామున 3 గంటలకే మొదలయ్యే ఈ దందా పదిగంటలకళ్ల వేల రూపాయల మార్కును దాటిపోతుందంటే, ఎలాంటి అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుందంటే ఈ సీఐ సాబ్ చలవేనని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు తెగ భక్తిని ప్రదర్శిస్తున్నారు.

అసలు కథ ఇది

మట్టి ఇసుకను అక్రమంగా తరలించే ట్రాక్టర్లు వర్ధన్నపేట, ఐనవోలు మండలాలకు చెందిన కొత్తపల్లి, ఇల్లంద, కట్ర్రాల, పంథిని, కడారిగూడెం, కక్కిరాలపల్లి, నందనం, రాంనగర్ గ్రామాల నుంచి ప్రధాన రహదారిపై ఉన్న ఆ పొలిస్ స్టేషన్ ను దాటుకుని మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ కాలని వంద పీట్ల రోడ్ వద్ద ఉన్న అడ్డలో మట్టి ఇసుకను విక్రయించాలి. అయితే గతంలో ఈ స్టేషన్ ముందునుంచి ట్రాక్టర్లు వెళుతున్నాయి కనుక కొంతమంది కానిస్టేబుళ్లు నిద్రాహారాలు మానుకొని తెల్లవారు జాము నుంచే ఓ మర్రి చెట్టుకింద అడ్డ బీటాయించి ట్రాక్టర్కు వంద చొప్పున వసూలు చేసేవారట.ఇంత బహిరంగం కావడంతో ఆనోట ఈ నోటా పోలీస్ కమిషనర్ దృష్టికి రావడంతో వసూళ్ల పోలీసులకు స్థాన చలనం కలిగింది.ఈలోగా ఆ స్టేషన్ కు కొత్త సిఐ వచ్చాడు.వచ్చిరాగానే మామూళ్ల దందానే టార్గెట్ చేసాడు వసూళ్లకు అడ్డాగా మారిన మర్రిచెట్టు కింద వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫోటోలు తీసి వారు బదిలీ ఐఎలా చేశాడు. ఇదంతా బాగానే ఉంది.కానీ సీఐ సాబ్ ప్లాన్ మార్చడట.ఇంతటి బహిరంగంగా వసూలు చేస్తే బాగోదని ట్రాక్టర్ యజమానులనే ఏజెంట్లు గా నియమించుకున్నాడట.రోజు వారి వసూళ్లు మార్చి నెలవారిగా టార్గెట్ పెట్టాడట.ఒక్కో కానిస్టేబుల్ కు పది ట్రాక్టర్ల వారీగా పంచి వాటి వసూలు బాధ్యత మీదే అని చెప్పినట్లు సమాచారం.

సిఐ సాబ్ వసూల్ ఏజెంట్లు...?- news10.app

ఇదీ లెక్కా…..?

ఐనవోలు,వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లను దాటుకుని వచ్చాక ట్రాక్టర్లు వరంగల్,ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పోలీస్ స్టేషన్ ను దాటుకుని రావాలి.ఈ స్టేషన్ దాటాలంటే నెలవారి మాములు సర్వసాధారణం అయిపోయింది.ఐనవోలు,వర్ధన్నపేట మండలాల గ్రామాలనుంచి దాదాపు ఐదు వందలకు పైగానే ట్రాక్టర్లు తిరుగుతాయనేది ఓ అంచనా ,ఒక్కో ట్రాక్టర్ నెలకు సీఐ సాబ్ అదేశాల మేరకు 15వందల నుంచి రెండు వేలు చెల్లిస్తున్నదని విశ్వసనీయ సమాచారం ఈ లెక్కన 4వందల ట్రాక్టర్లకు లెక్కవేసుకున్న లెక్క లక్షల్లో ఉంటుంది. అంటే సీఐ సాబ్ జీతాన్ని మించిపోతుంది. దీనిలో కానిస్టేబుళ్లకు, ఇతర అధికారికి పొగ సీఐ కి భారీగానే మిగులుతుందని తెలుస్తోంది. నెల నెలా రావాల్సిన మొత్తం ఏ మాత్రం ఆలస్యం అయిన తనిఖీల పేరుతో ట్రాక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారట. విధిలేక తనిఖీలు నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉంటే ట్రాక్టర్ యజమానులకు ముందే ఉప్పందించి ఆ ట్రాక్టర్లు రోడ్ పైకి రాకుండా పోలీసులే చేస్తారట ఎందుకంటే… మామూళ్లు తీసుకుంటున్నారు కనుక అని ట్రాక్టర్ డ్రైవర్ లు అంటున్నారు.మొత్తానికి సీఐ సాబ్ భారీగానే దండుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.ఇటీవల మామునురు చెరువులో అక్రమంగా తెల్లవార్లు మట్టిని జేసిబి లతో తవ్వుతున్నారని న్యూస్10 సమాచారం ఇస్తే వస్తున్న.. వస్తున్న అంటూ మూడు గంటలైన ఆ సీఐ అక్కడికి రాలేదు సరికదా… సమాధానం చెప్పకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసాడు.. అలా ఎందుకు జరిగిందో అర్థం కాని విషయం.