అంతా బహిరంగం… ఐనా… అధికారుల మౌనం!

మట్టి నుంచి ఇసుక తయారీ అధికారులకు తెలుసట ,చర్యలు మాత్రం ఉండవట
వాహనాలు సీజ్ చేసిన కేసులు నమోదు చేసిన అవి నామమాత్రమేనట
రెవెన్యూ ,మైనింగ్ శాఖ అధికారులైతే దందా ప్రాంతాన్ని పర్యాటక స్థలంలా చూసి గమ్మున వచ్చేస్తారట…
అక్రమ దందా లో అధికారుల వాటాపై ప్రజల అనుమానం…?
చర్యలకు అందుకే వెనుకాడుతున్నారని ఆరోపణ.

పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందనే…. నానుడి మట్టిని ఇసుకగా మార్చుతున్న అక్రమార్కులకు సరిగ్గా… సరిపోతుంది. బహిరంగంగా ఎకరాల కొద్దీ భూముల్లో మట్టిని తవ్వి నీటితో కడిగి ఇసుకగా మార్చుతున్న వీరు ఈ దందా ఎవరికి తెలియదు తాము ఏదయినా చేయొచ్చని విర్రవీగుతున్నారట. తమ సొంత భూముల లాగా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి లాగా వాగులో,ప్రభుత్వ బూముల్లో దర్జాగా ఖనీలు పాతి వాటికి తాళ్ళు కట్టి సరిహద్దులు ఏర్పర్చుకొని మరీ ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు వీరు. కొందరైతే ఎకరాల కొద్దీ భూమిలో ప్రహరిగొడ పెట్టి గేట్ ఏర్పాటు చేసి మరీ ఈ దందాను కొనసాగిస్తున్నారు మట్టిని ఇసుకగా మార్చి కాసుల పంట పండిస్తున్నారు.అంతా బహిరంగం... ఐనా... అధికారుల మౌనం!- news10.app అధికారుల మౌనం…?

వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఇంతటి బరితెగింపుతో నాసిరకం నకిలీ ఇసుకను మట్టినుంచి తయారు చేస్తుంటే అరికట్టాల్సిన అధికారులు మాత్రం దొంగ నిద్ర నటిస్తున్నారు.వాగుల్లో, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ దందా యథేచ్ఛగా నడుస్తున్న అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లైన లేదు. 60 నుంచి వంద పీట్ల లోతు గోతులు తవ్వి ప్రజల, కూలీల ప్రాణాలు హరించుకుపోతున్న అధికారుల్లో మాత్రం చలనం కలగడంలేదు. రెవెన్యూ అధికారులకైతే తమ క్షేత్ర స్థాయి సిబ్బంది నుండి సమాచారం ఉన్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చడడం లేదు. వారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ప్రస్తుతం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఎదో కంటి తుడుపు చర్య గా పోలీసులు వాహనాలను సీజ్ చేసినట్లు చేసి నామమాత్రపు కేసులు బుక్ చేసి తిరిగి వదిలి పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. దింతో అక్రమార్కులు ఎల్పాటిలాగే తమ దందాను కొనసాగిస్తున్నారు.అంతా బహిరంగం... ఐనా... అధికారుల మౌనం!- news10.app

రెవెన్యూ, మైనింగ్ జాడెక్కడ…?

మట్టిని ఇసుకగా మార్చి నాసి రకం ఇసుకను అమ్మి సొమ్ముచేసుకొంటున్న రెవెన్యూ,మైనింగ్ అధికారుల దృష్టికి మాత్రం ఈ విషయం ఇప్పటివరకు చేరలేదట. ఇంతటి బహిరంగంగా జేసిబి, ప్రోక్లినర్లతో మట్టిని తవ్వుతూ రాత్రి పగలు తేడాలేకుండా నీటితో మట్టిని ఇసుకగా మార్చుతున్న ఈ అధికారుల దృష్టికి పోకపోవడం నిజంగా వింతే. ఈ అధికారులను న్యూస్10 వివరణ కొరితే కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఇదే సమాధానం చెప్పారు. మా దృష్టికి రాలేదని, ఎవరైనా పిర్యాదు చేస్తే చూస్తామని రొటీన్ డైలాగులు అధికారులు కొట్టారు. ఒక్కోసారి ఈ ప్రాంతాలను ఇదే అధికారులు పర్యాటక ప్రాంతాళ్ల సందర్శించి గమ్మున వెనక్కి తిరిగి వచ్చారు కానీ చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకాడారట.

అధికారుల వాటా ఎంత…?

నిర్మాణ రంగంలో ఇసుకది కీలక పాత్ర పెద్ద పెద్ద నిర్మాణాలు చేసేటప్పుడు ఇసుక సరిగా లేదంటే కుప్పకూలే ప్రమాదం ఉంది. దింతో భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ ప్రమాదం జరిగాక చర్యలకు ఉపక్రమించకుండా ముందే వీరి ఆటకట్టిస్తే ఎలాంటి ముప్పు ఉండదు కానీ అధికారులు అలా చేయకపోవడంతో అక్రమార్కులకు, అధికారులకు ఎదో సంబంధం ఉందని సర్వత్రా ఆరోపణలు వినవస్తున్నాయి. మట్టిని ఇసుకగా మార్చి సొమ్ము చేసుకుంటున్న వారి దగ్గరి నుంచి వాటాలు అందుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.పెద్దమొత్తంలో నెలవారిగా అధికారులకు అందుతుండడంతోనే వీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు అంటున్నారు. ఇకనైన అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అంతా బహిరంగం... ఐనా... అధికారుల మౌనం!- news10.app

పిర్యాదు చేస్తే చూస్తాం – ఐనవోలు తహశీల్దార్ మంజుల

మట్టిని తవ్వుతూ ఇసుకగా మార్చుతున్న వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎం చేయాలో చూస్తం. స్థానిక ఎస్సై ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటే అక్రమంగా తరలిస్తున్న వారికి జరిమాన విధిస్తున్నాం.

రహదారి పైకి వస్తేనే పట్టుకుంటాం – ఏ వి భాస్కర్ తహశీల్దార్, వర్ధన్నపేట

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు రహదారిపైకి వస్తే పట్టుకుంటాం. చెరువులో, వాగులో మట్టి తవ్వితే తాము ఎం చేయలేము అది మైనింగ్ పరిధిలోకి వస్తుంది మేమెల పట్టుకుంటాం.

అది రెవెన్యూ వారే చూసుకోవాలి – రవీందర్, ఎడి మైనింగ్

చెరువుల్లో, వాగుల్లో మట్టి తవ్వితే మాకేం సంబంధం లేదు. అది రెవెన్యూ శాఖ చూసుకోవాలి. మీరు వారితో మాట్లాడారు కనుక నీను కూడా మాట్లాడి ఇద్దరం కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తాం.