వరంగల్ సత్య హాస్పిటల్ ఎదుట ఆందోళన

తమ బంధువు మరణించడానికి వైద్యులే కారణమని మృతుని బంధువులు ఆదివారం వరంగల్ లోని సత్య హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట కు చెందిన బొంత యాకయ్య కాలు విరుగడంతో గత కొద్ది రోజులుగా ఈ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం డాక్టర్ తో కట్టు కట్టించుకున్నాడు వైద్యం అనంతరం ఇంటికి వెళ్తుండగా మార్గమాధ్యమంలో తీవ్ర రక్త స్రావం ఐయింది, దింతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా అధిక రక్తస్రావం తో మృతి చెందాడు. దింతో బందువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మృతికి కారణం వైద్యులేనని ఎనిమిది సార్లు కట్టు కట్టించిన తొమ్మిదో కట్టుకు రక్తస్రావం తో మరణించడం ఏంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు.

వరంగల్ సత్య హాస్పిటల్ ఎదుట ఆందోళన- news10.app వరంగల్ సత్య హాస్పిటల్ ఎదుట ఆందోళన- news10.app వరంగల్ సత్య హాస్పిటల్ ఎదుట ఆందోళన- news10.app