పోలీస్ మార్క్ విం(మం)దు పార్టీ….?

తానా, తందాన గాన , బజానా ఏర్పాట్లు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు..?
మూడు వందల మందికి హన్మకొండలోని ఓ రెస్టారెంట్లో మందు విందు….?
పదవీ విరమణ వేళా ఓ పోలీస్ పెద్ద సారు … పేద్ద పార్టీ?
‘పాపడం’ లా కరిగిపోనున్న పైసలు….మద్యం
కరోన వేళా నిబంధనలు గిబంధనలు జాన్తానై

సోమవారం రాత్రే గ్రాండ్ పార్టీ…?

అసలే పోలీస్ సారు పదవీవిరమణ పార్టీ … అతిధులందరిని పువ్వులా అరుసుకోవాలి. ఎక్కడా తేడా రావద్దు,ఇది లేదు అనద్దు ….అబ్బ సారు ఏంచేశారు పార్టీ అని నలుగురు మాట్లాడుకోవాలి.. అందుకే ఆ సారు రెస్టారెంట్లు ఓపెన్ అవుతున్న మొదటి రోజే ‘పాపడం’ లా పైసలు ఖర్చు చెయ్యాలనుకున్నాడు.పాపం సారు ఎప్పటినుంచి రెస్టారెంట్ ఓపెన్ కోసం ఎదురుచూస్తున్నాడో..తెలియదు కాని విం(మం)దు పార్టీకి హన్మకొండలోని ఓ రెస్టారెంట్లో భారీ ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పార్టీకి మూడు వందల మంది అథిథులు హాజరవుతున్నట్లు తెలిసింది.సోమవారం సాయంత్రం జరగనున్న ఈ పార్టీకి నగరం నడిబొడ్డున ఉన్న ఆ రెస్టారెంట్ ఏర్పాట్లన్నీ చకా చకా చేసేసిందట. ఫుడ్ తప్ప మద్యం అనుమతి లేని ఈ రెస్టారెంట్ పోలీస్ పెద్ద సారు కోసం మందుకు కూడా సై అనడంతో వచ్చే అతితులందరికోసం భారీ స్థాయిలో మద్యం సిద్ధం చేసినట్లు తెలిసింది.

పోలీస్ మార్క్ విం(మం)దు పార్టీ....?- news10.app

నిబంధనలకు తూట్లు …!

కరోన నేపథ్యంలో మూడు నెలల తర్వాత తెరుచుకుంటున్న రెస్టారెంట్లకు కఠినమైన నిబంధనలను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కోవిడ్‌ నియంత్రణ మార్గదర్శకాలను అన్ని సంస్థల యజమాన్యాలు, నిర్వాహకులు కచ్చితంగా పాటించి తీరాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీడ్స్‌ని విడుదలచేశారు. వీటన్నింటిని కాదని అధికసంఖ్యలో జనం ఒకే చోట చేరకూడదని మరిచి మద్యం అనుమతి లేని రెస్టారెంట్లో పార్టీ ఏర్పాటు చేసి నిబంధనలకు పోలీస్ పెద్ద సార్ తూట్లు పొడుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు కరోన విజృంభిస్తున్న సందర్భంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందిపోయి మందు విందు పార్టీలు ఏర్పాటు చేసి ఏదైనా జరిగితే ఎవరు బాద్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. మందు విందు పార్టీకి బ్రేక్ వేసి తనకు అనుమతి లేకున్నా ఇతరుల మందు విందు పార్టీకి అనుమతించిన ఆ రెస్టారెంట్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.చేతిలో అధికారం ఉందికదా అని తాను ఎలచెపితే అలా ఆడుతారని తమకు అడ్డు ఎవరు లేరని ,ప్రశ్నించే వారిని తన అధికార బలంతో బెదిరించవచ్చని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్ పెద్ద సారు ఇలా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు.మరి విందు మందు పార్టీ పై పోలీస్ సార్ తన మనసు మార్చుకుంటాడా…లేదా? చూడాలి.