మొద్దు నిద్ర కాదది…

అధికారుల దొంగ నిద్ర…!
మట్టి, ఇసుక, చెరువుల్లో తవ్వకాలు, అక్రమ రవాణాలు కళ్ళ ముందే జరుగుతున్న వీరికి కనపడదు, వినపడదు
అక్రమార్కుల దందాపై వివరణలు అడిగితే సమాధానమే ఉండదు
ఏకరాలకొద్ది రాత్రనక పగలనక భారీ వాహనాలతో తవ్వి టిప్పర్ల కొద్ది తరలిస్తున్న వీరి దృష్టికి ఏమాత్రం రాదు
అధికారుల కళ్ళు, నోరు ముస్తున్నదేంటీ…?మూయిస్తున్న వారెవరు…?

దొంగ నిద్ర నటిస్తున్న ఐబీ, రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, పోలీస్ అధికారులు. నిద్రపోతున్న వారిని లేపడం చాలా సులువు.మొద్దు నిద్ర పోతున్న వారిని సైతం తట్టి లెపొచ్చు నిద్ర నటిస్తున్న వారిని అదే దొంగ నిద్ర పోతున్న వారిని లేపడం కనాకష్టం. సరిగ్గా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇదే జరుగుతుంది. అక్రమాలు ఎన్ని జరుగుతున్న అధికారులు మాత్రం తమ దొంగ నిద్రను వీడడం లేదు. చూసి చూడనట్లు దొంగ నిద్ర నటిస్తున్నారు. జరిగేది తెలుసు, ఎలా జరుగుతుందో తెలుసు,అక్రమార్కులు ఎవరో తెలుసు అయిన చూస్తాం… చేస్తాం మా దృష్టికి ఇంకా రాలేదు ఇలాంటి సమాదానాలతో కాలం గడుపుతారు తప్ప ఎలాంటి చర్యలు మాత్రం ఉండవు. ఈ అధికారుల తీరుపై ప్రజలనుంచి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయిన వీరి ప్రవర్తనలో ఎంత మాత్రం మార్పు ఉండదు. సరికదా ప్రశ్నించిన వారిపై వీరు ఎగిరెగిరి పడతారు.

మొద్దు నిద్ర కాదది...- news10.app

సమాధానం ఏంటో…?

మట్టి, ఇసుక, చెరువుల అక్రమ తవ్వకాలపై అధికారులు ఎం చెపుతారు. గ్రామం, నగరం తేడా లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపి అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతుంటే అధికారులు కనీసం ఈ అక్రమ దందాలపై నోరు విప్పరు. అనుమతులు లేకున్నా ప్రభుత్వ కార్యాలయల ముందునుంచే వాహనాలలో రవాణా అవుతున్న తమకేం పట్టనట్లే వ్యవహరిస్తారు. గ్రామాల్లో పేదలు ఎడ్ల బండ్లలో చిటికెడు మట్టి తీసుకెలిన అగ్గి మీద గుగ్గిలం ఐయ్యే అధికారులు పెద్ద పెద్ద వాహనాల జోలికి మాత్రం పోరు. పొద్దస్తమానం భారీ వాహనాలను చెరువులోకి తీసుకుపోయి పదుల సంఖ్యలో వాహనాల్లో మట్టి తరలుతున్న అధికారులు గమ్మున ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో అందరికి తెలుసు. ఎవరిని ఎవరు మాయ చేస్తున్నారో తెలుసు కావాల్సినదానికోసం అధికారులు ఎన్ని విమర్శలైన భరిస్తారు తప్ప చర్యలు మాత్రం ఉండవు. దొంగ నిద్ర నటిస్తూ దొరకకుండా ఎలా అక్రమ వ్యాపారం చేయాలో కొందరు అధికారులే అక్రమార్కులకు చెపుతున్నారంటే వీరి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎకరాల కొద్దీ భూముల్లో ఎలాంటి భయం లేకుండా తమ సొంత భూమిలో చేసినట్లు లారీలకొద్ది ఇసుక, మట్టి తవ్వుకుపోతున్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కుల అక్రమ తవ్వకాలపై గ్రామాలనుంచి ఫిర్యాదులు అందిన అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లైన కావడం లేదు. ఫిర్యాదులు చెత్త బుట్ట పాలైతున్నాయి తప్ప చర్యలు మాత్రం శూన్యం.దింతో అధికారులపై ప్రజలకు అపనమ్మకం,ఆగ్రహం తప్ప ఏముంటాయి…?

ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నార…?

ఇసుక ,మట్టి అక్రమంగా తరలిచడంలో అక్రమార్కులకు ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నార…? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే పార్టునర్లుగా ఉంటూ దందా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నెక్కొండ మండలంలో జడ్పిటీసీ భర్త పాలెం చెరువులో కొంతమందితో కలిసి అక్రమంగా చెరువులో తవ్వకాలు సాగిస్తూ …ఎం చేసుకుంటారో చేసుకోండి.. అంతా నాఇష్టం అంతున్నాడంటే అధికారాన్ని ఉపయోగించి మట్టిని తవ్వుతూ లక్షలు లూటీ చేసేందుకు ఇతగాడు ఏమాత్రం వెనకాడడం లేదనేది స్పష్టం. దింతో అక్రమ వ్యాపారాలలో కొందరి ప్రజాప్రతినిధుల పాత్ర ఉందనేది తెలుస్తోంది. వీరూ అధికారులతో స్నేహం నటిస్తూ అన్ని రకాలుగా వారిని సంతృప్తి పరుస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారని అందుకే అధికారులు ఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఐబీ, మైనింగ్, విజిలెన్స్, పోలీస్ అధికారులపై ఆరోపణలు వినవస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సాక్ష్యలు కనపడుతున్న వీరు మాత్రం మాకేం తెలియదు అన్నట్లు ఉంటున్నారు. అక్రమార్కులు వనరులు దోపిడిచేస్తున్న ప్రభుత్వ ఖజానాకు భారీ బొక్క పెడుతున్న వీరికి వచ్చేది వీరికి వస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. రాజకీయనాయకుల కనుసన్నలలో మెదులుతూ వారేం చేస్తున్న తలలు ఊపుతున్న అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు అక్రమార్కులపై కొరడా జులిపిస్తారా లేదా…చూడాలి.