సివిల్ సప్లై అధికారి…… ఆస్తుల్లో ఘనాపాటి…?

అతను రాజకీయనాయకుడు కాదు, వ్యాపారవేత్త అసలే కాదు కానీ కోట్లరూపాయలకు అధిపతి అయ్యాడట…. సర్కార్ కొలువు చేస్తూ నెల నెలా జీతం తీసుకుంటున్న ఇతగాడు తరతరాలు తిన్నా తరగని ఆస్తులను అక్రమంగా సంపాదించాడని పౌరసరఫరాల శాఖలోనే బాగా ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఈ సారు తాను పనిచేస్తున్న పౌరసరఫరాల శాఖలోని లొసుగులను తనకు అనుకూలంగా మార్చుకుని లెక్కలేనన్ని ఆస్తులను సమకూర్చుకున్నాడని విశ్వసనీయ సమాచారం. ధాన్యం కొనుగోలు ఇతర విషయాల్లో బాగానే చేతివాటం చూపించే ఈ సారు అందినకాడికి దండుకొని ఆర్దికంగా ఎప్పుడో బాగా బలపడిపోయినట్లు తెలుస్తుంది.

సివిల్ సప్లై అధికారి...... ఆస్తుల్లో ఘనాపాటి...?- news10.app

సర్కార్ వారు ఇచ్చే జీతానికి ఇతగాడు పోగేసిన ఆస్తులను చూస్తే ఏమాత్రం పొంతన ఉండదు సరికదా ఆ ఆస్తులను చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయమని ప్రచారం జరుగుతోంది… మరీ అంతలా సంపాదించే ఉద్యోగం ఏంటనుకుంటున్నార!అది ప్రభుత్వంలోని కీలకమైన సివిల్ సప్లై శాఖ ఆ శాఖకు అనుబంధం గా ఉన్న కార్పొరేషన్ కు ఈ సారు ఓ జిల్లా మేనేజర్ సారు జీతం మహా అయితే లక్షరూపాయలు దాటదు కానీ ఈయనగారి ఆస్తులు చూస్తే అక్రమంగా కూడబెడుతున్నారు, దండుకుంటున్నారు అని మనం నిత్యం అనుకునే కొందరు రాజకీయనాయకులకు సైతం సాధ్యపడుతుందా? అనే అనుమానం రాకమానదట ఇతనెవరో కాదండి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఈ సారు…. ఈ శాఖలో తనకు తోచిన విదంగా అక్రమ సంపాదన ను పోగేసి దానితో బినామీల పేరుతో ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం ….అంతేకాదు అక్రమంగా ఆస్తుల సంపాదనలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఈ మేనేజర్ సాబ్ ను చూసి ప్రభుత్వ ఉద్యోగం చేసే ఇతగాడికి ఈ స్థాయిలో ఆస్తులు ఎలా వచ్చాయో అర్థంకాక ఆ శాఖలోని ఉద్యోగులే తలలు పట్టుకుంటున్నారట

బినామీల పేరుతో అక్రమాస్తులు?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లాకు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి అక్రమంగా సంపాదించిన డబ్బుతో బినామీల పేరుతో ఆస్తులు కూడబెడుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్ కొత్తపేటలో అపార్ట్ మెంట్ లో ఓ ప్లాటు, హన్మకొండ నగరంలో ఓ ఖరీదైన బిల్డింగ్(ప్లాజా), పర్వతగిరి మండలంలో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ తోట, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ప్లాట్ లు, హన్మకొండ లో అపార్ట్ మెంట్ లో రెండు ప్లాట్ లు బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు తను ఉండేందుకు 3 కోట్లతో ఓ విలాసవంతమైన భవనాన్ని హన్మకొండ లోని హంటర్ రోడ్ లో నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here