కరోనా వైరస్ విజృంభిస్తోంది

దేశంలో కరోన వైరస్ విజృంభిస్తోంది.కేంద్రం లాక్ డౌన్ తో అంతా కట్టుదిట్టం చేసిన కరోన కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దింతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.ఇవాళ ఒక్కరోజే పాజిటివ్‌ కేసులు 40 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 83 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 40,263కి చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 10,887 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

కరోనా వైరస్ విజృంభిస్తోంది- news10.app

దేశంలో ప్రస్తుతం 28,070 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో మృతి చెందిన వారితో కలిపి ఇప్పటివరకు 1,306 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6534 పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 1583 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 488 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం 1062 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో శనివారం రోజున కరోనా కేసులు కాస్తా పెరిగాయి. ఈ రోజు కొత్తగా 21కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1082కి చేరింది. ఇప్పటి వరకు 29మంది మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here