మనోధైర్యమే మందు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కరోనా తీవ్రత తగ్గింది…. భయపడకండి…. మీకు మనో ధైర్యం కల్పించడం కోసమే నేను ప్రతి రోజూ మాట్లాడుతున్నా…. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గం పాలకుర్తి కరోనా బాధితులకు, వారి కుటుంబసభ్యులకు ధైర్యం కల్పించారు.

మనోధైర్యమే మందు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు- news10.app

నియోజకవర్గంలోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా తగ్గుతుండటం శుభ పరిణామం…  తాజా పరీక్ష ల్లో ఒకటి రెండు కేసులు కూడా నమోదు కాలేదని మంత్రి తెలిపారు. కరోనా కు సర్కారు దవాఖానలో మంచి మందులు ఇస్తున్నారన్నారు. ఇచ్చిన ఆ మందులను సరిగ్గా వేసుకోవాలన్నారు. కరోనా కు నిజమైన మందు మన మనోధైర్యమే. ఆ ధైర్యం ఇవ్వడం కోసమే నేను ప్రతి రోజూ మీతో మాట్లాడుతున్నాను అన్నారు. కరోనా బాధితుల్లో నిరుపేదలు వుంటారని వాళ్ళని గుర్తించి ప్రజా ప్రతినిధులు అదుకోవాలని ఆదేశించారు.