ఎర్రబెల్లి కాషాయ తీర్టం……?

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తనకంటూ ఓ బలాన్ని ఏర్పరుచుకుంటు ఎమ్మెల్యే టికెట్ విషయంలో గతంలో కాస్త నిరాశకు గురైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కమలం వైపు చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది…గత సంవత్సర కాలంగా ప్రదీప్ రావు కమలం లోకి వెళ్లడం ఖాయమని తెలిసిన ఆ ఆరోపణలను,ప్రచారాలను ఆయన ఎక్కడ కొట్టిపారేయలేదు…దింతో ఆయన వెళ్లడం ఖాయం కానీ ఎప్పుడు వెళ్తారనే దానిపైనే చర్చ నడిచింది…ప్రస్తుతం మాత్రం ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయ తీర్టం పుచ్చుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది…

ఎర్రబెల్లి కాషాయ తీర్టం......?- news10.app

ఢిల్లీ పెద్దలతో మంతనాలు….?

కాషాయ తీర్టం పుచ్చు కోవడానికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది….కొద్దిరోజులక్రితం ఢిల్లీ వెళ్లిన ప్రదీప్ రావు తన చేరికపై ఢిల్లీ లో కమలం పెద్దలతో మాట్లాడి కావాల్సిన అభయం తీసుకున్నట్లు తెలియవచ్చింది…ఈ విషయాన్ని వరంగల్ కు చెందిన కొంతమంది బీజేపీ నేతలు సైతం ధ్రువీకరించారు… బిజెపి లోకి రావడానికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీలో చర్చ జరుగుతుంది..తన చేరికపై ,పార్టీ లోకి వస్తే ఎలా అంశం పై ప్రదీప్ రావు బీజేపీ కి చెందిన కొంతమంది నేతలతో స్వయంగా తానే చర్చలు సైతం జరిపినట్లు సమాచారం. మరోవైపు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయ తీర్టం పుచ్చుకుంటే వరంగల్ త్రినగరి లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..త్రినగరిలో కొంతమంది అనుచరులను వివిధ డివిజన్లలో యువత ను కలిగి ఉన్న ప్రదీప్ రావు ఎంతోకొంత ప్రభావితం చేయగలుగుతాడని తెలుస్తుంది… మొత్తానికి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు బీజేపీ లో చేరితే ఉమ్మడి జిల్లాలో రాజకీయ ప్రకంపనలు ఖాయంగానే కనిపిస్తున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here