“సృష్టి” పై నోరు మెదపరేం….?

గ్రేటర్ వరంగల్ పరిధిలోని పోచంమైదాన్ జంక్షన్ పక్కనే ఉన్న సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ పై టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనంగా ఉన్నట్లు సమాచారం ఆసుపత్రి బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు న్యూస్-10 కథనాలను వెలువరించిన విషయం విదితమే అయితే తూతుమంత్రంగా స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు విచారణ పేరుతో హడావిడి చేసి గమ్మునున్నట్టు తెలుస్తోంది. పూర్తి సెట్ బ్యాక్ లేకుండా ఈ ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణం జరిగినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో వారికే తెలియాలి

"సృష్టి" పై నోరు మెదపరేం....?- news10.app

యాజమాన్యం తో కుమ్మక్కైయ్యారా?

వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే ఆఘమేఘాల మీద స్పందించి ఆ నిర్మాణాలను కూల్చే అధికారులు నగరం నడిబొడ్డున పోచంమైదాన్ లో సెట్ బ్యాక్ లేకుండా “సృష్టి” ఆసుపత్రి బిల్డింగ్ నిర్మించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ పై వచ్చిన కథనాలపై స్పందించి స్వయంగా సిటీ ప్లానరే రిపోర్ట్ అడిగినా అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆ విషయాన్ని నాన్చుతున్నట్లు వినికిడి. అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఈ విషయాన్ని నాన్చుతుండడంతో సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ యాజమాన్యం తో సంబంధిత అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏదో ఒప్పందం కుదర్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి

స్పష్టంగా కనిపిస్తున్న చర్యలు తీసుకోరా?

వరంగల్ నగరం పోచంమైదాన్ జంక్షన్ పక్కన ఉన్న “సృష్టి” ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా పూర్తి సెట్ బ్యాక్ లేకుండా నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత బహిరంగంగా కనిపిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ పై చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here