ఆరోగ్య మంత్రికి కబ్జా రోగమట….?

ఈటల ఉద్వాసనకు రంగం సిద్ధమేనా….?
అధికార పార్టీ చానల్ లో మంత్రి భూదాహమంటు వార్త…
ఈటల తన పౌల్ట్రీ పామ్ చుట్టు అసైన్డ్ భూమి ఆక్రమించారని వార్త కథనాలు
ఈ వార్త కథనాలు మంత్రి పదవి నుంచి తొలగించడానికేనని ఊహాగానాలు?

రేపో మాపో సీఎం నిర్ణయం…?

ఆరోగ్య మంత్రికి కబ్జా రోగమట....?- news10.app

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉద్వాసనకు దాదాపు రంగం సిద్ధం ఐయినట్లే కనిపిస్తుంది… రేపో మాపో సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ నుంచి ఈటల ను తొలగిస్తారని గులాబీ వర్గాల్లోనే హాట్ టాపిక్ నడుస్తుంది… మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం ఆచ్ఛంపేట గ్రామంలో మంత్రి సతీమణి పేర జమున హ్యాచరిస్ ఉంది దీనికోసం గాను 130/5,130/9,130/10, 64/6 సర్వే నంబర్లల్లో ఈటల కోట్ల విలువ చేసే భూముల కబ్జాకు యత్నించారని… అధికార పార్టీ ఛానల్ లో ‘ఆరోగ్యమంత్రికి కబ్జా రోగం’ అంటూ కథనాలు ప్రసారం చేశారు… బాధితుల వద్దకు వెళ్లి లైవ్ టెలికాస్ట్ చేశారు… ఈ రకంగా అధికార చానల్ లోనే కథనాలు గంటలకొద్దీ ప్రసారం అవుతుండడంతో… మొత్తానికి ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఊడినట్లేనని ప్రచారం జరుగుతోంది… కాగా ఇటీవల సీఎం పిఆర్వో కు ఉద్వాసన పలికే ముందు అధికార పార్టీ చానల్ లో ఇలాగే కథనాలు రావడాన్ని గులాబీ కార్యకర్తలే గుర్తుచేసుకుంటున్నారు… మరి ఈ విషయంలో ఈటల ఎలా స్పందిస్తారో చూడాలి.