చేప ప్రసాదం బంద్

ఆస్తమా కోసం మృగా శిర కార్తె లో వేసే చేప ప్రసాదం ను నిలిపివేస్తున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. కరోన వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సారి చేప ప్రసాదం పంపిణీని నిలిపి వేస్తున్నట్లు వారు తెలిపారు. ఎవరు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెపితే నమ్మకూడదని, ఆన్ లైన్ లో పంపుతామని చెప్పిన నమ్మకూడదని చెప్పారు. చేపప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు హాజరవుతారు కనుక కార్తె కు 20 రోజుల ముందే చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదనే విషయాన్ని వారు వెల్లడించారు. ఆస్తమా రోగులెవరు తమ వద్దకు రాకూడదని బత్తిని సోదరులు విజ్ఞప్తి చేసారు.

చేప ప్రసాదం బంద్- news10.app