గోపాల లీల….

పరకాల నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ లైంగిక ఆరోపణల్లో ఇరుక్కున్నాడు. వరంగల్ గిర్మాజీపేట కు చెందిన అంజలీదేవి అనే మహిళ అతనిపై ఆరోపణలు చేసింది. తనను నమ్మించి మోసం చేశాడని తనను అన్ని రకాలుగా వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వరంగల్ లోని నవీన్ రాజ్ ఇంటి ఎదుట ఆ మహిళ బుధవారం మహిళ సంఘాలతో కలిసి ధర్నా చేసింది.

2020 డిసెంబర్ లో హైదరాబాద్ లోని బెస్ట్ వెస్ట్రన్ హోటల్ కు తనను రమ్మని తనపై అత్యాచారం చేశాడని, తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను లోబర్చుకున్నాడని, 2021 ఫిబ్రవరిలో ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుంటానని చెప్పి హైదరాబాద్ లకిడికపూల్ లోని ఓ హోటల్ లో తనకు తాళి కట్టడని బాధిత మహిళ తెలిపింది.హోటల్ గదిలో రహస్యంగా తాళి కట్టడంతో వరంగల్ లో అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కోరడంతో బెదిరిస్తు.. తనను చంపుతానని బెదిరించాడని మహిళ ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరింది…

గోపాల లీల....- news10.app

పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ ఐ ఆర్…

గోపాల నవీన్ రాజ్ తనను మోసం చేశాడనే ఆరోపణ చేస్తూ బాధిత మహిళ అంజలీదేవి వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో బుధవారం పిర్యాదు చేసింది. పిర్యాదు అందుకున్న పోలీసులు సెక్షన్ 417,420,376(2), ఐపిసి కింద జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఇది ఇలావుంటే బాధిత మహిళ బుధవారం వరంగల్ సిపి ని కలిసి తన గోడు వెళ్లబోసుకొని తనకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం.

ఆరోపణలు అవాస్తవం….

టీ అర్ ఎస్ నాయకుడు గోపాల నవిన్ రాజ్ పై వచ్చిన లైంగిక అరోపణలను ఆయన అభిమానులు ఖండించారు. బుధవారం ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో నవిన్ రాజ్ అభిమాని నాయుని భరత్ మాట్లాడుతూ…

రాజకీయా ఏదుగుదల ఓర్వలేకనే ననిన్ రాజ్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అపదలో ఉన్నవారికి సహయం చేసే గుణం నవిన్ రాజ్ దని, అంజనిదేవి వేనుక ఉండి కోంత మంది నాయకులు ఈ డ్రామ నడుపిస్తున్నారని అన్నారు. నవిన్ రాజ్ పై వచ్చిన అరోపణలను న్యాయపరంగా ఏదురుకోంటామని చెప్పారు.