బయటపడ్డ గుట్కా డాన్…?

ఆయనో గుట్కా డాన్ … వరంగల్ ఉమ్మడి జిల్లా లో ఎక్కడ గుట్కా దొరకాలన్న ఏ పాన్ షాప్ లో సరుకు ఉండాలన్న ఇతగాడి ప్రమేయం లేనిదే సరుకు రాదని దాదాపు అందరికి తెలుసట… కే వలం వరంగల్ ఉమ్మడి జిల్లా నే కాకుండా.. తెలంగాణలోనే ఇతను గుట్కా అక్రమ వ్యాపారం లో ఆరితేరినవాడని ఆరోపణలు అనేకం ఉన్నాయి… ఇతగాడిపై ఇప్పటివరకు అనేక అభియోగాలు ఉన్న పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకుందామన్న వారికి చిక్కలేదు… తాజాగా రెండు రోజుల క్రితం వరంగల్ నగరంలో గుట్కా సరఫరా చేస్తున్న వ్యక్తిని టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారట… ఐయితే ఈ వ్యక్తి అందించిన సమాచారం మేరకు టాస్క్ పోర్స్ పోలీసులు గుట్కా డాన్ తో పాటు అతని తమ్ముణ్ణి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది… వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని హన్మకొండ లోని ఓ పోలీస్టేషన్ లో అప్పగించారట… నిషేధిత గుట్కా వ్యాపారంలో ఆరితేరి కోట్లాది రూపాయలు వెనకేసి అభియోగాలు ఎన్ని ఉన్నా ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా ఉన్న ఈ గుట్కా డాన్ ను టాస్క్ పోర్స్ పోలీసులు చాలా కష్టపడి అరెస్ట్ చేసిన లాభం లేకుండా పోయిందని తెలిసింది… గుట్కా డాన్ పరపతి కింద కనీసం ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా పోకుండా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చాలా సింపుల్ గా పరిష్కారం జరిగిపోయిందని సమాచారం… ఓ రోజంతా ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న వారిని పోలీసులు స్టేషన్ బెయిల్ పై విడుదల చేసినట్లు తెలిసింది.

బయటపడ్డ గుట్కా డాన్...?- news10.app

ఓ ఎమ్మెల్యే జోక్యం….?

గుట్కా డాన్ అతని తమ్ముడి ని టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోగానే వారి తరుపున పైరవీలు బాగానే వచ్చినట్లు సమాచారం… వీరిని విడిపించేందుకు వస్తున్న పైరవీలు చూసి ఓ దశలో ఆ పోలీస్ స్టేషన్ అధికారులే ఆశ్చర్య పోయారట… చివరకు ఓ ఎమ్మెల్యే పోన్ చేసి వారితరుపున పైరవి చేసి… విడిపించినట్లు తెలిసింది… టాస్క్ పోర్స్ అదువులోకి తీసుకున్నారు పైగా పోలీస్ స్టేషన్ లో అప్పగించారు… ఈ విషయం ఆనోట…ఈ నోట బయటపడితే అసలుకే ఎసరు వస్తుంది కనుక పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉండేలా కేసు నమోదు చేసి… స్టేషన్ బెయిల్ ఇచ్చి మరీ పోలీసులు దగ్గరుండి ఇంటికి పంపించారని విశ్వసనీయంగా తెలిసింది… అసలే ఎమ్మెల్యే కావడంతో పోలీసులు సైతం ఏమాత్రం ఎదురు చెప్పకుండా గుట్కా డాన్ అతని తమ్ముణ్ణి వదిలివేశారట…. ఈ విషయాన్ని అలా ఉంచితే నిషేధిత గుట్కా వ్యాపారంలో ఆరితేరిన గుట్కా డాన్ పట్టుబడిన విషయాన్ని అసలు పోలీసులు తమ ఉన్నతాధికారి తెలియజేశార… లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ఫోన్ చేయగానే ఎలాంటి విచారణ చేయకుండా గుట్కా డాన్ ను అతని తముణ్ణి వదిలివేశార అనే అనుమానం కలుగుతోంది… ఈ విషయం కనుక పోలీస్ ఉన్నతాధికారులకు తెలిస్తే వేరేరకంగా ఉండేదని… వరంగల్ ఉమ్మడి జిల్లా తోపాటు… రాష్ట్రంలో జరుగుతున్న నిషేధిత అక్రమ గుట్కా వ్యాపారం తీగ కదిలేదని తెలుస్తోంది… ఇప్పటికైనా పోలీసులు ఈ విషయంలో దృష్టి సారిస్తే బాగుంటుందేమో…