స్వతంత్రుల గట్టి పోటీ….

గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది… నిన్నటి వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసిన అబ్యర్థులు చివరిరోజు ప్రచారంలో ఉరుకులు పరుగులతో ప్రచారం చేశారు… గెలుపే ప్రధాన ద్యేయంగా వారి ప్రచారం కొనసాగింది… ప్రచారంలో అధికారపార్టీ అబ్యర్థులు ముందుండగా వీరికోసం మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రచారంలో పాల్గొని అధికార పార్టీ అబ్యర్థులను గెలిపించాలని అభ్యర్తించారు… ఇక కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, బిజెపి నుంచి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు సైతం ప్రచారం చేసి తమ పార్టీ అబ్యర్ధులకు భరోసా నిచ్చారు. మొత్తానికి ఈ రోజుతో మైక్ లు మూగబోగ అబ్యర్థులు చివరి వ్యూహాల్లో బిజీగా మారారు… గప్ చుప్ గా గల్లీల్లో, వాడల్లో ఇంటింటి ప్రచారం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు… ఐయితే అబ్యర్థుల ప్రచారం వ్యూహాలు ఎలా ఉన్న వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు తమ సత్తా చాటెల ఉండడం ప్రధాన పార్టీలో కాస్త గుబులు పట్టుకుందట.

స్వతంత్రుల గట్టి పోటీ....- news10.app

స్వతంత్రుల గట్టి పోటీ….

వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కొన్ని డివిజన్ లల్లో ప్రధాన పార్టీ అబ్యర్ధులకు ప్రధానంగా టీఆర్ఎస్ అబ్యర్ధులకు స్వతంత్రులు గట్టి పోటీనిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది… నిన్నటి వరకు గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్ లల్లో తమకు ఎదురు లేదని అనుకున్న టీఆర్ఎస్ అబ్యర్థులు స్వతంత్రులనుంచి గట్టి పోటీ ఎదుర్కుంటున్నట్లు ఆయా డివిజన్ లల్లో టాక్ వినిపిస్తుంది… నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న ప్రచారం చివరి రోజు నుంచి స్వతంత్రులు కొన్ని చోట్ల ప్రచారంలో అన్యుహంగా పుంజుకోగా ప్రజలనుంచి సైతం ఆదరణ బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది…. దింతో వారు రెట్టించిన ఉత్సాహం తో ముందుకు కదులుతున్నారట…

స్వతంత్రులకు బెదిరింపులు…?

వివిధ డివిజన్ లల్లో పోటీచేస్తున్న స్వతంత్రులకు అధికార పార్టీ నాయకులనుంచి బెదిరింపులు వస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు… పోటీలో ఉండకూడదని నేరుగానే చెబుతూ బెదిరింపులకు డిగుతున్నట్లు వారు చెపుతున్నారు.. స్వతంత్రులతో ప్రచారంలో తిరిగే యువకులను బెదిరిస్తూ ప్రచారంలో తిరగకూడదని వార్నింగ్ ఇస్తున్నారని… ఎన్నికల తర్వాత మీరు బయట ఎలా తిరుగుతారో చూస్తామని బెదిరిస్తున్నారని వారు అంటున్నారు… ఇక కొంతమంది అబ్యర్థులు స్వతంత్ర అభ్యర్ధులు వాల్ పోస్టర్ ఇతర ప్రచార సామగ్రి ఏవి కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట… వాల్ పోస్టర్ లను స్వతంత్రులు గోడపై అతికించితే వాటిపై అధికార పార్టీ అబ్యర్థులు వారి పోస్టర్ లను అతికించి అవి కనపడకుండా చేస్తున్నారట… దింతో స్వతంత్ర అబ్యర్థులు అదికార పార్టీ అభ్యర్థుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తాము పోటీనిస్తున్నామనే భయంతో వారు ఇలాంటి పనులు చేస్తున్నారని వారు అంటున్నారు… ఏదిఏమైనా మొత్తానికి కొన్ని డివిజన్ లల్లో స్వతంత్రులు గట్టి పోటీనే ఇస్తున్నారు… గెలుపు, ఓటమి విషయాలు అటుంచితే అధికార పార్టీతో సహా ప్రధాన పార్టీలకు స్వతంత్రుల గుబులు పట్టుకుందనేది మాత్రం నిజం.