మోత బంద్…

ముగిసింది ప్రచారం….
ఎన్నికల ప్రహసనం….!

హోరెత్తిన మైకులు,హామీల వరదలు!
గల్లీ గల్లీ ప్రచారాలు గడప గడప అభ్యర్థనలు!

అన్ని పార్టీలను ఆదరించిన ఓటర్లు!
ఎవరికి ఓటేయనున్నారో దేవుళ్ళు!

ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువ గొప్పది…!
ఓటే కదా దేశ గతిని మార్చేటి ఆయుధం!

ఓటు అదుపు తప్పద్దు…
ఆదమరిచి అనర్హులకు వేయొద్దు. …!