ప్రజల మద్యే ఉంటా: 39 వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి బోరిగం నాగరాజు

విద్యావంతుడు, ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు… కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచి యువతను కలుపుకొని అనేక మంది వలసకూలీలకు, డివిజన్ ప్రజలకు తనవంతు సాయం చేసి అందరి మన్ననలు పొందాడు…. ప్రజలకు సేవచేయాలనే తలంపుతో తాను రాజకీయాల్లో అడుగు పెట్టానని నిత్యం ప్రజల మద్యే ఉంటూ ప్రజల బాగోగులు చూస్తానని అంటున్నాడు… ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ గుర్తులతో ముందుకుపోతుంటే తాను ప్రజలకు చేసిన సేవే గుర్తుగా డివిజన్ లో ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నానని అంటున్నాడు 39 వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి బోరిగం నాగరాజు… ఓటర్ దేవుళ్ళు తనను గెలిపిస్తే డివిజన్ లో అసలు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని మాటిస్తున్నాడు… డివిజన్ లో తనకున్న ఆదరణను చూసి కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరెన్ని బెదిరింపులకు గురిచేసిన భయపడేది లేదని అని అంటున్నారు నాగరాజు… తనతో ఉంటున్న యువతను కొంతమంది ప్రధాన పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని వీటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు… తాము ఎలాంటి వారేమో డివిజన్ ప్రజలకు తెలుసని తాడోపేడో ప్రజాక్షత్రంలోనే తేల్చుకుంటామని అంటున్న 39 వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి బోరిగం నాగరాజుతో న్యూస్10 ఎన్నికల ముఖాముఖి…

ప్రజల మద్యే ఉంటా: 39 వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి బోరిగం నాగరాజు- news10.app

న్యూస్10: విద్యావంతులు,ఉద్యోగం చేసుకుంటున్న వారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు….?

బోరిగం నాగరాజు: యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని అందరుకోరుకుంటున్నారు…ఇతర ప్రోపేషన్ లాగానే రాజకీయాన్ని ఎంచుకొని సేవే మార్గం గా నడిస్తే సమాజంలో ఖచ్చితంగా మార్పు సాద్యం అవుతుంది… అందుకే తాను రాజకీయాల్లో అడుగు పెట్టాను…ఎన్ని ఆటంకాలు వచ్చిన సేవే మార్గం గా ముందుకు పోతాను.

న్యూస్10: మీ రాజకీయ నేపథ్యం ఏంటి…?

బోరిగం నాగరాజు: ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు…ప్రాధాన పార్టీలలాగ గుర్తులు లేవు కేవలం తాను ప్రజలకు చేసిన సేవ గుర్తుగా ఈరోజు ప్రజల మధ్య తిరుగుతున్న… ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్న…రాజకీయాల్లో అడుగుపెట్టిన తనకు ప్రజలు బాగా సహకరిస్తున్నారు కూడా..

న్యూస్10: ఏ లక్ష్యంతో గ్రేటర్ ఎన్నికల బరిలో దిగారు….?

బోరిగం నాగరాజు: కేవలం ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో 39 వ డివిజన్ నుంచి స్వతంత్ర అబ్యర్థిగా బరిలో దిగాను…ప్రజలు కూడా తనను బాగా ఆదరిస్తున్నారు… యువత రాజకీయాల్లో ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో తాను రాజకీయ రంగ ప్రవేశం చేశాను.

న్యూస్10: మీ ప్రచారం ఎలా ఉంది…?

బోరిగం నాగరాజు: 39 వ డివిజన్ లోని ప్రతి గల్లీ, వాడలో ప్రచారానికి వెళ్ళినపుడు ప్రజలనుంచి విశేష స్పందన వస్తుంది…మొన్నటివరకు పదవిలో ఉన్నవారు ఎలా వ్యవహరించారో కూడా ప్రజలు చెబుతున్నారు… డివిజన్ లో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదు… హామీలు హామీలుగానే మిగిలాయి.

న్యూస్10: 39 వ డివిజన్ లో మీరు గెలిస్తే ఎం చేస్తారు….?

బోరిగం నాగరాజు: ప్రజల ఆశీస్సులతో 39 వ డివిజన్ లో గెలిస్తే అసలు అభివృద్ధి అంటే ఎలా ఉంటదో చూపిస్తా… డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడతా. డివిజన్ లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తా… నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓరాజ సమస్యల పరిష్కారానికి నిత్యం పాటుపడత…

న్యూస్10: అందరూ హామీలు ఇస్తున్నారు… మీ హామీలు ఎందుకు నమ్మాలి…?

బోరిగం నాగరాజు: ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం చేసుకుంటూ కేవలం రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లో అడుగుపెట్టాను… గతంలో రాజకీయాల్లో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేసా…స్వచ్చంద కార్యక్రమాలు అనేకం నిర్వహించ… నిలువ నిదా లేనివారి కోసం… ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇండ్లను నిర్మించి ఇచ్చా… ప్రజలకోసం ఈ కార్యక్రమాలు చేసిన నేను ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇచ్చిన హామీలను విస్మరించకుండా నెరవేరుస్తా… ఈ విషయంలో డివిజన్ ప్రజలకు నాపై నమ్మకం ఉంది.

న్యూస్10: స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న మీకు ఏమైనా అడ్డంకులు ఎదురవుతున్నాయ…?

బోరిగం నాగరాజు: పోటీలో నిలిచిన దగ్గర నుంచి తనను నిలువరించేందుకు ప్రధాన పార్టీలు చాలా ప్రయత్నం చేశాయి… కానీ తాను వెనక్కు తగ్గలేదు… ప్రారంభంలో మాకు పోటీ లేదు అని ప్రచారం చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలనుంచి తమకు వస్తున్న ఆదరణను చూసి కుయుక్తులు పన్నుతున్నారు… ప్రచారంలో తన వెన్నంటి ఉంటున్న యువతను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు… ఎన్నికల తర్వాత ఎలా తిరుగుతారో చూస్తాం అంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు… ఎవరెన్ని మాట్లాడిన తమకు ఉన్న ప్రజాబలం వారికి సమాధానం చెబుతుంది..

న్యూస్10: 39 వ డివిజన్ ఓటర్లకు ఎం చెప్పదలుచుకున్నారు….?

బోరిగం నాగరాజు: డివిజన్ అభివృద్ధి కోసం కష్టపడే తత్వం ఉన్న తనను ఆదరించమని డివిజన్ ప్రజల ను కోరుకుంటున్న… గతంలో గెలిచిన వారు అభివృద్ధి చేయకుండా మాయమాటలతో ఎలా మోసం చేశారో గుర్తుంచుకొని గ్యాస్ సిలెండర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్న… గెలిస్తే ప్రజల మద్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తానని మాటిస్తున్నా….