జోరుగా చెన్నం మధు ప్రచారం: 6 వ డివిజన్ లో దూసుకుపోతున్న కారు

గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 6వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, పోటీ చేస్తున్న చెన్నం మధు ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో, ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అజీజ్ ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అభ్యర్థి చెన్నం మధు తో కలిసి, ఇంటింటికి వెళ్లి నిర్వహించిన ప్రచారంలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ ప్రచార కార్యక్రమం అనంతరం అజీజ్ ఖాన్ మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డివిజన్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించ లేదని ఆయన ఆరోపించారు.

ప్రజలు ఒకసారి చెన్నం మధు ని గెలిపిస్తే, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ సహకారంతో ఈ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం ఆరవ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న చెన్నం మధు మాట్లాడుతూ, తనకు ఈ డివిజన్ పట్ల పూర్తి అవగాహన ఉందని, ఒక్కసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి సేవ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు, సుమన్ గౌడ్, రెడ్డి రాజేశ్వర్, ఆరిఫ్, అలేఖ్య, గరిగె కిషోర్, జి కృష్ణ , సాంబయ్య , హరీష్, గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.