అభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్ ను గెలిపించండి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ తాళ్ల పెళ్లి జనార్దన్ గౌడ్

8వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నలుబోల సరళ సతీష్ లను గెలిపించాలని విస్తృతంగా ఇంటింటి ప్రచారం

నిరంతరం పేద ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించే, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే ప్రజలు గెలిపించాలని, టిఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ తాళ్ల పెళ్లి జనార్దన్ గౌడ్ తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని ఏనాడు కాంక్షించ లేదని, ఆయన అన్నారు. 8వ డివిజన్ నుంచి టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నలుబోల సరళ సతీష్ ను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం 8వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నలుబోల సరళ సతీష్ లను గెలిపించాలని విస్తృతంగా ఇంటింటి ప్రచారం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమం అనంతరం టిఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ తాళ్ల పెళ్లి జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ, వరంగల్ నగర అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, నలుబోల సతీష్ మాట్లాడుతూ, ఈ డివిజన్ అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న మన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ డివిజన్ లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ఒకసారి అవకాశం కల్పించి గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేతలు కూచన సునీల్, దేవుళ్ల పెళ్లి ప్రదీప్, శ్రీధర్, సిద్ది శెట్టి శ్రీనివాస్, అర్బన్ ప్రధాన కార్యదర్శి రుద్రో జు సంపత్, మహిళా నాయకురాలు అలేఖ్య మరియు తదితరులు పాల్గొన్నారు.