టిఆర్ఎస్ పార్టీ తోనే, అభివృద్ధి సాధ్యం: ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

టిఆర్ఎస్ పార్టీ తోనే, అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బిజెపి, కాంగ్రెస్ మాయమాటలు ప్రజలు విశ్వసించ వద్దని, ప్రజలకు వివరిస్తూ, గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, ఆదివారం 60 డివిజన్లో ఎన్నికల ప్రచారం సాగింది. ఆ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న దాస్యం అభినవ భాస్కర్ కు మద్దతుగా, కొనసాగుతున్న ఇంటింటి ప్రచారాన్కి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ, వడ్డేపల్లి గ్రామ అభివృద్ధి పట్ల పూర్తి అవగాహన ఉన్నా దాస్యం అభినవ్ భాస్కర్ ని గెలిపిస్తే, గ్రామం అభివృద్ధి లో అగ్రగామిగా నిలుస్తుందని, ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, స్థానికుడు వడ్డేపల్లి వాస్తవ్యుడైన అభినవ్ భాస్కర్ ను గెలిపించాలని, తద్వారా ఈ గ్రామం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తోపాటు, ఇన్చార్జిగా వచ్చిన హైదరాబాద్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి, స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కేశ బోయిన అరుణ శ్రావణ్, తాజా మాజీ కార్పొరేటర్ మిడిదొడ్డి సప్న, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మట్టుపల్లి మోహన్ గొల్లపల్లి రమేష్, రాజుల సుమన్, ముదిరాజుల సంఘం అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు రామరాజు, రామ్ లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.