అసలే కరోనా… ఆపై వర్షం పడే అవకాశం..

జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ
కరొనతో ప్రజలు ఓవైపు సతమతం అవుతుంటే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆందోళనకు గురిచేస్తోంది.వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల వెల్లడించడంతో ఆందోళన మరింతగా ఎక్కువైంది.

ఓ వైపు తెలంగాణ‌లో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో 229కేసులు నమోదు కావటంతో తెలంగాణా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కరోనా వైరస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే త్వరగా చనిపోతుంది . దాని ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్తున్న వేళ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సమయంలో వాతావరణ శాఖ షాకింగ్ విషయం వెల్లడించింది.

క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోన్న వేళ‌ హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి జ‌ల్లుల‌ నుంచి ఓ మోస్తరు వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం న‌మోద‌య్యే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. కోమోరిన్ ఏరియా నుంచి రాయలసీమ వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ప్ర‌భావం క‌నిపిస్తోంది. మ‌రోవైపు సౌత్ మధ్య మహారాష్ట్ర, దాని రీజ‌న‌ల్ ఏరియాస్ లో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావ‌ర‌ణ శాఖ‌ అధికారులు వెల్లడించారు. వీటి ప్ర‌భావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది.వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది .

మ‌రోవైపు ఇప్పటివరకు గమనిస్తే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత రెండు రోజులు గ‌రిష్ఠంగా 38.2 డిగ్రీలు, కనిష్టంగా 24.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ‌య్యాయి. వాతావరణశాఖ వ‌ర్షాల అంచనాతో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపధ్యంలో వర్షాలు పడితే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు .పంటలు కూడా చాలా వరకు పొలాల్లోనే ఉండిపోవటంతో వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here