ఎమ్మెలే పదవికి రాజీనామా చేస్తా

తనపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తి వేయకుంటే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు.తనపై ఉన్న కేసులు ఎత్తివేయాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.ఇటీవల లాక్ డౌన్ నేపధ్యంలో నెల్లూరు ప్రాంతంలో ఎమ్మెల్యే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సమయంలో ఎమ్మెల్యే 144 సెక్షన్ ను ఉల్లంఘించారని,సామాజిక దూరం పాటించలేదని పోలీసులు వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు