రైతు పైసల కో(వె)త…

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం డబ్బులు కొనుగోలు చేసిన దానికంటే తక్కువగా వస్తున్నాయని ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో ఐకేపి లో రైతుల ధాన్యం డబ్బుల కోత వ్యవహారం తాజాగా బయటపడింది…. ధాన్యం అమ్మినదానికంటే ఒక్కో రైతుకు వారి ధాన్యం పరిమాణాన్ని బట్టి వేలల్లో కోత విధించినట్లు రైతులు చెపుతున్నారు .ఒక్కో రైతుకు 4 వేల నుంచి 20 వేల వరకు ధాన్యం డబ్బుల్లో కోత విధించారు. దింతో ఆందోళనకు గురైన రైతులు ఇటీవల ఐకేపి కమ్యూనిటీ కోఆర్డినెటర్ కు ఈ విషయమై పిర్యాదు చేయగా ….తమ డబ్బులు ఎప్పుడు వస్తాయని ఓ రైతు ఫోన్ చేసి అడిగితే సహనం కోల్పోయి మలుసుకొని పండాలి అని పరుషపదజాలం ఉపయోగించాడు.. దింతో రైతులు ఆవేదన చెందారు..వివరాల్లోకివెలితే..

ఇది ఐకేపి మార్క్ కోత…..?

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో మొత్తంఐకేపీ కొనుగోలు కేంద్రాలు శాయంపేట, పత్తిపాక, పెద్ద కోడపాక ,కాట్రపల్లి గ్రామాల్లో మొత్తం నాలుగు కేంద్రాలు ఉన్మాయి.మండలం మొత్తం రైతులు పన్నెండు వందల మంది. ఉండగా ఈ సీజన్ లో57,972 క్వింటాళ్ల ధాన్యం పండించారు.ఐకేపి సేకరించినధాన్యం బస్తాలు ఒక లక్ష 44 వేల 939 ఉండగా ప్రభుత్వం ఈసారి ఏ గ్రేడ్- ధాన్యానికి 18 88 మద్దతు ధర దొడ్డు రకం.

రైతు పైసల కో(వె)త...- news10.app

సి గ్రేడ్- 18 66 సన్నరకం నిర్థారించారు.ఇదంతా బాగానే ఉన్నా రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన దానికంటే రైతుల ఖాతాలో డబ్బులు తక్కువగా పడ్డాయి…కొందరు రైతులకు నాలుగు వేలు, ఆరు వేలు,ఎనిమిది వేలు,పన్నెండు వేలు,ఇంకొందరికి 20 వేలు ఇలా ఆయా రైతులు అమ్మిన ధాన్యం పరిమాణాన్ని బట్టి ధాన్యం డబ్బుల్లో కోత విధిస్తూ ఖాతాల్లో డబ్బులు జమచేశారు. దింతో తమ ఖాతాల్లో విక్రయించిన దానికంటే డబ్బులు వేలకు వేలు తక్కువ పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఐకేపి అధికారులను రైతులు అడిగితే తమకు ఎం తెలియదు అంతా పైనే జరిగిందని చాలా సులువుగా చేతులు దులిపేసుకున్నారట.

ఐయితే ఐకేపి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు క్వింటాళ్ల వారిగా అధికారులు నమోదు చేసి పంపిన జాబితా ఆధారంగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి… మరి రైతు అమ్మిన ధాన్యాన్ని తక్కువగా చూపి ఐకేపి లో చేతివాటం చూపించార…?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు ధాన్యం సెంటర్ కు తీసుకువెళ్లి కాంటా వేసినప్పుడు క్వింటాళ్ల లెక్క సరిగానే చూపిన అధికారులు నమోదు చేసే జాబితాలో తమ ఇష్టారాజ్యాంగ ధాన్యాన్ని తగ్గిస్తూ నమోదు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఆరోపణలకు తోడుగా ధాన్యం కొనుగోలు చేసినపుడు నమోదు చేసే ట్రక్ షీట్ లో ఐకేపి సిబ్బంది పెన్సిల్ తో రాయడం అనుమానాలను బలపరుస్తుంది… రైతుల ముందు ట్రక్ షీట్ లో పెన్సిల్ తో సరిగానే రాసిన అధికారులు… రైతు వెళ్ళాక పెన్సిల్ రాతను చేరిపివేసి.. ధాన్యం పరిమాణం తగ్గించి నమోదు చేసినట్లు కొందరు చెపుతున్నారు. అందుకే రైతులకు ధాన్యం డబ్బులు తక్కువగా వచ్చాయని అర్ధమవుతుంది… కానీ ఐకేపి మాత్రం రైతులు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా పైన కట్ ఐయ్యాయని చేతులు దులిపేసుకొని రైతుల డబ్బులు వేలల్లో పోయిన కనీసం పట్టించుకోకుండా తమను ఎవరు ఏమి చేయరనే ధీమాతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది… ధాన్యం డబ్బుల కోత తీగ లాగితే ఇక్కడ లక్షల రూపాయల చేతివాటం బయట పడేటట్లు తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు రైతులకు డబ్బుల్లో కోత పడి తక్కువ రావడానికి కారణం అవుతున్నట్లు సమాచారం.

రైతుల డబ్బులు చెల్లించాలి : సాధు కుమారస్వామి రైతు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సంబంధించిన డబ్బులు ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాల్ చేయడం సిగ్గు చేటు. నాకు సంబంధించిన సుమారు 19 వేల ఐదు వందల రూపాయలు అక్రమంగా కాజేసి రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. శాయంపేట గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతుల నుండి e అక్రమంగా వసూలు చేసిన లక్షలాది రూపాయలు ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తక్షణమే చెల్లించాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మకాలు చేపడతామని చెప్పి రైతుల జేబుకు చిల్లు పెట్టడం బాధాకరమన్నారు. అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కుమ్మక్కై ఈ దుశ్చర్య కు పాల్పడడం దారుణమన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నను దోచుకుంటారా..?: కోలా ఆనందం రైతు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నను దోచుకునే ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అని ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజా ప్రతినిధులు సభలు సమావేశాలలో ప్రసంగించడం తప్ప రైతులకు సమస్య వస్తే నేటికి ఏ ఒక్క ప్రజా ప్రతినిధి స్పందించకపోవడం సిగ్గుచేటు. అక్రమంగా రైతుల డబ్బులు కాజేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై తక్షణమే జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

రైతులను దోపిడికి గురి చేస్తున్నారు: సాదు తిరుపతి రైతు.

రైతులు పండించిన పంటను ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రమేయం లేకుండా కొనుగోలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూనే మరోవైపు స్థానిక అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో కుమ్మక్కై లక్షలాది రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాయంపేట ఐకేపీ కొనుగోలు కేంద్రం నుండి 100 మంది రైతులు సుమారు 45 లారీల ధాన్యం తరలించినట్లు తెలిపారు. తరుగు పేరుతో పదుల సంఖ్యలో ధాన్యం బస్తాలు తొలగించి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. అప్పులు చేసి కష్టపడి పంటను పండిస్తే లాభం లేకపోయిందని అన్నారు.

న్యాయం చేయమంటే బూతులు మాట్లాడుతున్నారు: సింగారపు సాంబయ్య రైతు.

ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మాకు వచ్చే మొత్తం రూపాయల నుండి వేలాది రూపాయలు అక్రమంగా కాజేశారని అధికారులను అడిగితే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కు చెప్పిన ఒరిగేదేమీ లేదంటూ కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వాపోయారు. రైతుల డబ్బులు అక్రమంగా కాల్ చేసి న్యాయం చేయమని అడిగితే ఐకెపి లో పనిచేసే కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఇలా మాట్లాడడం సరైంది కాదు. రైతుల నుండి అక్రమంగా కాజేసిన లక్షలాది రూపాయలను తక్షణమే చెల్లించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.