కౌశిక్ రెంటికి చెడినట్లేనా….?

పాడి కౌశిక్ రెడ్డి టీపీసీసీ మాజీ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు… కాంగ్రెస్ పార్టీలో హుజురాబాద్ నియోజకవర్గంలో బాగానే కష్టపడ్డాడు…కష్టానికి తగ్గట్టుగానే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నాడు… మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో గట్టి పోటీనే ఇచ్చాడు… ఒకానొక సందర్భంలో ఈటల తన స్థానం కోల్పోతాడా… అన్నంతగా పోటీ ఇచ్చాడని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు చెపుతారు… ఎలాగోలాగా ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గం నుంచి తిరిగి గెలిచి తన సత్తా చాటాడు…. అప్పటినుంచి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో కాస్త ఇనాక్టివ్ అయిపోయిన సందర్భం వచ్చినప్పుడల్లా ఈటల ను ఏకిపారేసేవాడు… ఈలోగా ఈటల పై భూకబ్జా ఆరోపణలు రావడం గులాబీ బాస్ భర్తరఫ్ చేయడం తో హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు… టీఆర్ఎస్ నాయకులకంటే తానే పదే పదే ప్రెస్ మీట్ లు పెట్టి ఈటల ను విమర్శించాడు… దింతో కౌశిక్ టీఆర్ఎస్ లో చేరుతాడానే ఊహాగానాలు వచ్చాయి… ఈ ఎపిసోడ్ నడుస్తుండగానే ఈటల రాజీనామా చేయడం ఉప ఎన్నిక అనివార్యం కావడం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి అభ్యర్థి విషయంలో తర్జనభర్జన పడుతుండడంతో కౌశిక్ కు గులాబీ వైపు మనసు మళ్లింది… అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తూనే టీఆర్ఎస్ లో చేరి గులాబీ టిక్కెట్ తెచ్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు నియోజకవర్గ పరిధిలో ప్రచారం జరిగింది… కొద్దీ రోజుల్లో ఇది నిజం కాబోతుండగా తొందరపడ్డ కౌశిక్ ఫోన్ లో ముందే కూసి రెంటికి చెడ్డ రేవడిలా మారినట్లు తెలుస్తుంది… యువకుడితో మాట్లాడుతూ అడ్డంగా బుక్ కావడం ఆ ఆడియో కాస్త ఫోన్ లో వైరల్ కావడం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపడంతో ప్రస్తుతం అటు గులాబీలో చోటు దక్కక ఇటు కాంగ్రెస్ టికెట్ దక్కదని కౌశిక్ ప్రస్తుతం తల పట్టుకున్నాడట… ఆడియో ఇంతలా వైరల్ కావడంతో టీఆర్ఎస్ ఎలాగు చేర్చుకోదు క్రమశిక్షణ ఉల్లంఘించాడని ప్రజల్లో మైనస్ అవుతుందని కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వదు… దింతో ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో అయ్యో కౌశిక్ అని అందరూ భాదపడిపోతున్నారట… ఈటల శిబిరంలో మాత్రం ఎంతో కొంత ఓట్లకు గండి కొట్టే అడ్డంకి తొలగిందని సంబరపడి పోతున్నారట… ఏదిఏమైనా కౌశిక్ తొందరపడి అలా ముందుగానే ఫోన్ లో కూయడం ఆయనకు రాజకీయంగా భారీ నష్టాన్నే కలిగిస్తోంది.