ముందే కూసాడు…. పాడి కౌశిక్ అత్యుత్సహాం….

వైరల్ అవుతున్న సంచలన వ్యాఖ్యలు
టిఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ నాకే …
యూత్ కి ఎన్ని డబ్బులు కావాలన్నా నేను చూసుకుంటా
యూత్ సబ్యులకు 3వేల నుంచి 5 వేలు ఇస్తా …
మాదన్నపేట యువకునితో సంభాషణ.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలువు

హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది… టి పి సి సి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వరుసకు తమ్ముడు ఐయ్యే కౌశిక్ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఈటల చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఈటల రాజేందర్ రాజీనామా తో ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో టీఆర్ఎస్ టిక్కెట్ తనకే నంటూ ఓ నాయుడితో మాట్లాడుతూ అడ్డంగా బుక్ ఐయిపోయారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి ఆడియో వివాదాస్పదం అవుతోంది. టిఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ తనకేనంటూ,యూత్ కి ఎన్ని డబ్బులు కావాలన్నా తాను చూసుకుంటానని తాను గులాబీ పార్టీ తరుపున బరిలో నిలిచియూత్ సబ్యులకు 3000-5000 ఇస్తానని కమలాపూర్ మండలం మాదన్నపేట కు చెందిన ఓ యువకునితో యువకునితో మాట్లాడిన మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.

ముందే కూసాడు.... పాడి కౌశిక్ అత్యుత్సహాం....- news10.app

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలువాలని కౌశిక్ రెడ్డి ఆ యువకునికి చెప్పడంతో ఈ మాటలు నియోజకవర్గం వ్యాప్తంగా సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి… కాగా తన ఆడియో లీక్ అవడం పై ఇప్పటివరకు కౌశిక్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.