రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం…

ఎరువుల బాకీ 80 వేల రూపాయల క్రింద ఓ రైతుకు చెందిన 3 ఎకరాల భూమిని ఓ ఎరువుల వ్యాపారి అక్రమంగా పట్టా చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన తాడిచర్ల లో ఆదివారం చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన రైతు రాగం సతీష్, తన తల్లి రాగం రాజమ్మ లు పురుగుల మందు డబ్బా తో వ్యాపారి తాడిచర్ల పిఎసిఎస్ డైరెక్టర్ మల్కా రాజేశ్వర్ రావు ఇంటి ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సంఘటన స్థలానికి పోలీసు, రెవెన్యూ అధికారులు వెల్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కాగా విషయం తెలుసుకున్న ఎరువుల వ్యాపారి పారిపోవడంతో బాధిత రైతు కుటుంబం వ్యాపారి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేశారు.

రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం...- news10.app