కేటీఆర్ సార్… మా గోడు వింటారా…?

తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన
రైల్వే కేసుతో కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయిన ఉద్యమకారుడు
సాయం కోరుతూ విసిగిపోయి ఆమరణ దీక్ష చేస్తే మేమున్నామంటూ దీక్ష విరమింపజేశారు.
కేటీఆర్ సాయం చేస్తానని ఉద్యమకారులకు హామీ ఇచ్చి రెండేళ్లు ఐయింది
పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సాక్షిగా ఆర్థిక సాయం చేస్తానన్న కేటీఆర్
ఇప్పటికి అతిగతి లేదు…పట్టించుకొనే వారే లేరు
సాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలంటున్న గొర్రెకుంట, ధర్మారం ఉద్యమకారులు

కేటీఆర్ సార్... మా గోడు వింటారా...?- news10.app

మెరికల్లాంటి కుర్రాళ్లు తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షతో సొంత రాష్ట్రం సిద్దించాలన్న లక్ష్యంతో ఉద్యమంలో చురుకుగా ముందుకు కదిలారు…తెలంగాణ రాష్ట్రం స్వప్నం నెరవేర్చేందుకు ఉద్యమ నాయకులు ఏ పిలుపునిచ్చిన పిలుపునందుకొని ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు రుచి చూసారు,జైలు ఊచలు లెక్కపెట్టారు… చదువును సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యే లుగా ఎంపీలు గా పదవుల్లో ఉన్న వారితోని శభాష్ అనిపించుకున్నారు…. తెలంగాణ రాష్ట్రం సిద్దించింది… ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది నాయకత్వం వహించిన నాయకులకు ఉన్నత పదవులు దక్కాయి… మరి ప్రాణాలకు తెగించి ఆర్థికంగా, విద్యా పరంగా నష్టపోయిన యువకులకు ఎం దక్కింది… ఏది దక్కలేదు నాయకుల హామీలు దక్కాయి, మీరు గొప్ప చాలా బాగా చేశారు అనే కంటితుడుపు మాటలు దక్కాయి… తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడిచిన ఈ ఉద్యమ కారులకు చిల్లి గవ్వ దక్కలేదు… హామీ ఇచ్చి మరిచారు తప్ప ఇప్పటికి హామీ నెరవేరలేదు సొంతంగా స్వయం ఉపాధి కల్పించుకుందామన్న తెలంగాణ సర్కారు కనీసం కనికరించలేదు దింతో దిక్కు తోచని స్థితిలో తెలంగాణ యువ ఉద్యమకారులు ప్రభుత్వ నిర్లక్షాన్ని నిలదీస్తున్నారు… నాయకుల మాటలు విని ఇప్పటికి సాయం కోసం ఎదురు చూస్తున్న వారి చేతగాని తనాన్ని వారే నిందించుకుంటున్నారు.

ఇది ఈ ఉద్యమ కారుల గత చరిత్ర..

వరంగల్ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితున్న తరుణంలో కాలేజి విద్యను అభ్యసిస్తూనే ఉద్యమ జెండాను ఒడిసిపట్టుకొని రాష్ట్ర సాధనకోసం ముందువరుసలో నిలిచింది వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట, ధర్మారం యువత .తమ గ్రామాల్లో జేఏసీ ఏర్పాటు చేసుకొని ఏ బెదిరింపులకు భయపడకుండా ఉద్యమాన్ని ఉధృతం గా నడిపించారు ఈ గ్రామాలకు చెందిన యువత వీరిలో విజయ్, ప్రవీణ్, ప్రమోద్, నవరత్నం, గణేష్, సాగర్, సందీప్ , శ్యామ్ లు యువ ఉద్యమ కారులకు సారథ్యం వహిస్తు…ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు… అనేక సార్లు పోలీస్ లాఠి దెబ్బలను రుచి చూసారు…. ఈ ఎనిమిది మంది పై అత్యంత కఠినమైన పి డి పి పి యాక్ట్ నమోదు చేసి 2012 ఆగష్టు 21 న జైలుకు పంపారు… తొమ్మిది రోజుల జైలు జీవితం గడిపి ఈ నలుగురు యువకులు బయటకు వచ్చి మళ్ళీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు… జాన్ పాక వద్ద రైలు పట్టాలకు చెందిన 256 ఫిష్ ప్లేట్ లు తొలగించారని రైల్వే శాఖ కేసు పెట్టింది..2012 లో కేసు నమోదు ఐయితే వారి సొంత ఖర్చులతో కేసును ఎదుర్కోగా 2019 ఏప్రిల్ 1 న కేసు కొట్టివేశారు… ఉద్యమ సమయంలో కేసు నమోదు ఐయితే 7 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి కేసు కొట్టివేసిన…. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీరిలో విజయ్ అనే ఉద్యమ కారుడు బేడీలతోనే డి ఎస్సి పరీక్షరాసి స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోయాడు.

వచ్చిన ఉద్యోగం పోయింది

ఎనిమిది మంది ఉద్యమకారుల్లో గణేష్ అనే ఉద్యమకారుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాడు… కానిస్టేబుల్ గా ఎంపికయి ఎస్ బి విచారణలో రైల్వే కు సంబంధించిన పి డి పి పి యాక్ట్ కేసు ఉందని తేలడంతో అధికారులు కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు.. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న ఉద్యమ సమయంలో ఉన్న కేసు మూలంగా వచ్చిన ఉద్యోగం కాస్త రాకుండా పోయింది.

ఉద్యమ కారుల ఆమరణ నిరాహారదీక్ష

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యువ ఉద్యమకారులకు తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకుండా, కనీసం గుర్తింపు కూడా లేకపోవడంతో ఆవేదన చెందిన ఉద్యమకారులు ఉద్యమం లో జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకోవాలని 2019 శాసనసభ ఎన్నికల ముందు అక్టోబర్ 6 న ఆమరణ దీక్ష చేసారు. ఎన్నికల ముందు ఈ రకమైన ప్రచారం బాగుండదని కేటీఆర్ ఆదేశంతో ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్ల ను పంపడంతో ఆయన వచ్చి దీక్ష విరమింపజేస్తారు .గొర్రెకుంట, ధర్మారం గ్రామాలు పరకాల నియోజకవర్గంలో ఉండడం వల్ల ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి తిరిగి జోక్యం చేసుకొని వీరిని మంత్రి కేటీఆర్ కు కలిపించారు. వీరి సమస్యలను సానుకూలంగా విన్న కేటీఆర్ ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చారు. ఎన్నికలు ముగియగానే ఆదికారంలోకి రాగానే ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేస్తానని కేటీఆర్ ఈ సందర్బంగా హామీ ఇస్తారు.

ఇప్పటికి అందని సాయం…

2018 అక్టోబర్ 10 న ఎన్నికలు ముగిసిన వెంటనే అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికి ఈ ఎనిమిది మంది యువ ఉద్యమకారులకు సాయం దక్కలేదు… మాటిచ్చిన నాయకులు ఆ విషయం మర్చిపోయి ఎన్నికల్లో గెలిచి మొహం చాటేశారు… కనీసం కేటీఆర్ దృష్టికి వీరి విషయాన్ని తీసుకువెల్దామనే ఆలోచనను సైతం స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికి చేయలేదు… ఎన్నికల తర్వాత .మీరే ఉద్యమకారులను తీసుకురావాలని కేటీఆర్ చెప్పిన స్థానిక ఎమ్మెల్యే మాత్రం పూర్తిగా ఆ విషయాన్నే మర్చిపోయాడని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ తమ గోడు వినైన స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మంత్రి కేటీఆర్ వీరి విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

మమ్మల్ని ఆదుకోవాలి మిద్దెపాక విజయ్ గొర్రెకుంట

మలిదశ ఉద్యమంలో ముందువరుసలో ఉండి కేసుల పాలైనాము 2012 లో రైల్వే కేసులో జైలు జీవితం గడిపి ఉద్యోగాలు రాక ఆర్ధికంగా చితికిపోయాము మాకు (జైలు జీవితం గడిపిన ఉద్యమకారులకు) న్యాయం చేయండి అని 2019 అక్టోబర్6 వ తేదీన ఆమరణ నిరాహారదీక్ష కు దిగితే ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు మూడు రోజుల అనంతరం మాతో దీక్ష విరమిoపచేసి కే టి ఆర్ వద్దకు తీసుకెళ్లారు .మాతో 30 నిమిషాలు కే టి ఆర్ గారు మాట్లాడి మీ 8 మందికి ప్రభుత్వం తరపున కానీ పార్టీ తరుపున కానీ ఆర్థిక సహకారం తో పాటు ఉద్యోగం కల్పిస్తామని అన్నారు ధర్మన్న మనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారం రోజులకు వీళ్ళని తీసుకుని నా వద్దకు రా….వీళ్ళకి న్యాయం చేద్దాం అన్నారు నేటితో ఆ మాటకు రెండు సంవత్సరాలు పూర్తి అయింది కే టి ఆర్ గారికి మా విషయం గుర్తు చేస్తే తప్పకుండా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది.

నా ఉద్యోగాన్ని ఇప్పించండి బందెల గణేష్ కానిస్టేబుల్ కు ఎంపికయిన వ్యక్తి

మేము పోరాడింది తెలంగాణ కోసం స్వరాష్ట్రం వచ్చింది అయినా కూడా ఉద్యమకారులకు ప్రభుత్వం ఏమి చేయలేదు నేను కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను కానీ ఉద్యమంలో రైల్వే కేసు ఉండడం వల్ల నన్ను ఉద్యోగానికి తీసుకోలేదు నా ఉద్యోగం కోసం నేను ఎక్కని గడప లేదు కలవని మంత్రి లేడు నేను కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొన్న ముందు వరుసలో ఉండి జైలు జీవితం అనుభవించినం ఎలాంటి దొంగతనం దారిదోపిడీ చేయలేదు ఉద్యమం చేయడం మా తప్పా మేము చేసింది స్వరాష్ట్రం కోసమే కదా దయచేసి నా ఉద్యోగాన్ని నాకు ఇప్పించండి నాతో పాటు 7 గురికి కే టి ఆర్ గారు మాట ఇచ్చారు నేటికి2 సంవత్సరాలు అయింది ఇప్పటికయినా న్యాయం చేయాలని కోరుతున్నాను.

రెండు సంవత్సరాలయ్యింది న్యాయం చేయండి గాదె సందీప్ ధర్మారం

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చదువును పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొని కే సి ఆర్ బాటలో నడిచాము 2012 లో జైలు జీవితం గడిపి 7 సంవత్సరాలు కోర్టు చుట్టు తిరిగినం కేసుల వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన మేము మా విషయాన్ని తెరాస అధినేత కు తెలియాలని మా విషయం ఆయన దృష్టికి వెళ్తే మాకు న్యాయం చేస్తాడని విషయం కే టి ఆర్ తెలవాలని ఆమరణ నిరాహారదీక్ష చేస్తే మమ్మల్ని గుర్తించిన ఎమ్మెల్యే చల్లా దీక్ష విరమింపచేసి రామన్న వద్దకు తీసుకెళ్లారు విషయం విన్న కే టి ఆర్ గారు మాకు హామీ ఇచ్చారు కానీ రెండు సంవత్సరాలు గడిచినా న్యాయం జరగలేదు దయచేసి మాకు తగు న్యాయం చేసి మా 8 మంది కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నాను.