మావోయిస్టు ల చేతిలో టీఆర్ఎస్ నాయకుడు హతం

ములుగు జిల్లాలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. TRS నాయకున్ని మావోయిస్టులు దారుణంగా హతమార్చారు.

మావోయిస్టు ల చేతిలో టీఆర్ఎస్ నాయకుడు హతం- news10.app

వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన TRS నాయకుడు మాడురి బిమేశ్వర్ రావును కత్తులతో పొడిచి హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా పొడిచిన మావోయిస్టులు. సంఘటనా స్థలంలో ఓ లేఖ వదిలి వెళ్లారు. కాగాఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం.

అధికార పార్టీలో కనసాగుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నాడని లేఖలో పేర్కొన్నమావోయిస్టులు. TRS- బీజేపీ నాయకులు వెంటనే వారి పదవులు రాజీనామాలు చేయాలని, లేకపోతే వారికి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.