టిఆర్ఎస్ పతనం ఓరుగల్లునుంచే

బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ

భయంతో కాదు మోడీ పై ఉన్న అభిమానంతో బీజేపీ లో చేరుతున్నారు

గ్రేటర్ ఎన్నికలలో కారు పంచర్ అవ్వడం ఖాయం

టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన న్యాయవాది అల్లం నాగరాజు

అధికార టిఆర్ఎస్ పార్టీ పతనం పోరుగల్లు ఓరుగల్లు నుంచే ప్రారంభమవుతుందని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. సోమవారం బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయవాది అల్లం నాగరాజు తన అనుచరులు 100 మంది యువకులతో కలిసి రావు పద్మ సమక్షంలో బీజేపీ లో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో రావు పద్మ మాట్లాడుతు … న్యాయవాది అల్లం నాగరాజు టీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీలో చేరడం చాలా సంతోషకరమాన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే జరుగుతుందని, ప్రజలు బలంగా నమ్ముతున్నారని అందుకే అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు.

టిఆర్ఎస్ పతనం ఓరుగల్లునుంచే- news10.app

నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ఆర్టిజన్లు సర్కారుకు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, వారిలో ఎక్కువగా బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, పెండింగ్​ హామీల తో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని, రానున్న రోజుల్లో అధికార పార్టీకి తగిన విధంగా ప్రజలు బుద్ది చెప్తారని రావు పద్మ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సిరికొండ సంజీవ రావు, రావు అమరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు బాకం హరి శంకర్, కనుకుంట్ల రంజిత్, రాంకీ యాదవ్, మండల సురేష్, సంగని జగదీశ్వర్, పొట్టి శ్రీనివాస్ గుప్త, సిద్దం నరేశ్ పటేల్, స్నేహాలత రెడ్డి, భవాని శంకర్, కల్లూరి పవన్, ఆకాష్ సింగ్, గౌతం, ఋషివర్ధన్, అపరూప సాయి, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారులకు అన్యాయం… అల్లం నాగరాజు

టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర సాధనకు అహర్నిశలు కష్టపడిన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని న్యాయవాది అల్లం నాగరాజు అన్నారు. బీజేపీలో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమం లో కష్టపడ్డ తాను టీఆర్ఎస్ లో చేరిన ఉద్యమకారుడిగా సరైన ప్రాధాన్యత దక్కకపోవడం వల్ల గత మూడు సంవత్సరాలు గా పార్టీ కి దూరంగా ఉన్నానన్నారు… బీజేపీ నుంచి పిలుపు రాగానే తన సొంత ఇంటి నుంచి పిలుపు వచ్చినట్లు భావించి తాను సంతోషంగా బీజేపీలో చేరానన్నారు. గ్రేటర్ వరంగల్ లో బిజెపి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అల్లం నాగరాజు అన్నారు.